గోల్డెన్ బ్రీఫ్ కేస్ అందుకున్న శ్రీహాన్.. ఎన్ని లక్షలు గెలుచుకున్నాడో తెలుసా?

తెలుగులో ప్రసారం అవుతున్న సీజన్ 6 తాజాగా ముగిసిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ షో ముగిసే వరకు ఎవరు విన్నర్ అవుతారు.

 Bigg Boss Telugu 6 Grand Finale Shrihan Took Golden Briefcase , Bigg Boss 6, Rev-TeluguStop.com

ఎవరు రన్నరప్ గా నిలుస్తారు అని ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి లు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోవడంతో శ్రీహన్, రేవంత్ మాత్రమే మిగిలారు.

ఇక వీరిద్దరిలో రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇక హౌస్ లో టాప్ త్రీ కంటెస్టెంట్లు మిగిలినప్పుడు హీరో రవితేజ సూట్ కేసు పట్టుకుని లోపలికి వెళ్ళగా మొదట ప్రైజ్ మనీ లో నుంచి పది శాతం ఇస్తానని తర్వాత దానిని 30 శాతం వరకు తీసుకెళ్లాడు.

కానీ ఎవరూ కూడా దాన్ని తీసుకుని ఎందుకు ముందుకు రాలేదు.కీర్తిని ఆమె ఫ్రెండ్ డబ్బులు తీసుకోమని చెప్పినా కూడా కీర్తి వద్దని తలాడించింది.దాంతో చేసేది ఏమీ లేక కీర్తి ఒట్టి చేతులతో బయటకు వచ్చేసింది.చివరగా శ్రీహాన్ రేవంత్ మిగిలడంతో నాగార్జున గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో హౌస్ లోకి వెళ్ళాడు.25 లక్షలు ఉన్న బ్రీఫ్ కేస్ ని ఎవరు సొంతం చేసుకుంటారని అడగగా ఇద్దరూ వద్దు అని చెప్పారు.ఆ తర్వాత నాగార్జున 30 లక్షలు ఎవరు తీసుకుంటాడని మరీ ఆఫర్ ఇచ్చాడు.

ఆ తర్వాత శ్రీకాంత్ అక్కడే ఉన్న ఆరోహి కీర్తి అభినయ మెరీనా రోహిత్ సుదీప వంటి కంటెస్టెంట్ల అభిప్రాయం అడిగి సూట్ కేస్ తీసుకోవడానికి ససేమిరా అన్నాడు.

దాంతో నాగార్జున ఆ డబ్బులు 40 లక్షలకు పెంచాడు.మొదట సూట్ కేసు తీసుకోవద్దు అని చెప్పిన శ్రీహాన్ తండ్రి చివరికి సూట్కేస్ తీసుకోమని చెప్పాడు.తండ్రి మాట విన్న శ్రీహాన్ ఆ నలభై లక్షల రూపాయలు గెలుచుకోవడంతో విన్న రేవంత్ కు కేవలం 10 లక్షలు మాత్రమే మిగిలాయి.

అలా శ్రీహన్ విన్నర్ కంటే ఎక్కువగా గెలుచుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube