నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటికే పలువురు హీరోలు టాలీవుడ్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే.తాజాగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా హీరోగా అడుగు పెట్టబోతున్నాడు.
అయితే నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు హీరో గా అడుగు పెట్టిన వారిలో తారకరత్న ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేక పోయాడు.ఆయన హీరో గా ఎంట్రీ ఇచ్చిన సమయం లో ఏకంగా ఏడు ఎనిమిది సినిమా లకు కమిట్ అయ్యాడు.
ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా అన్ని సినిమాలకు కమిట్ అయిన ఘనత కేవలం తారకరత్న కు మాత్రమే దక్కింది.మొదటి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు పర్వాలేదు అనిపించినా.
ఆ తర్వాత ఏ ఒక్క సినిమా తో కూడా తారకరత్న ఆకట్టుకోలేక పోయాడు.
హీరో గా సక్సెస్ కాక పోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కూడా సినిమాలు చేశాడు.అవి కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.మొత్తానికి తారకరత్న కెరియర్ లో అత్యంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు అనుకుంటున్న సమయం లో క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు తారకరత్న అధికారికంగా ప్రకటించాడు.
తాజాగా తెలుగు దేశం పార్టీ నాయకుల సమక్షం లో ఏపీ లో ఒక భారీ సభ ను నిర్వహించారు.తెలుగు దేశం పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం లో ఎక్కడ నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తెలుగు దేశం పార్టీ లో తన బలాన్ని నిరూపించుకునేందుకు కార్యకర్తల తాజాగా బల ప్రదర్శన చేశాడు.తారకరత్న పార్టీ లో ఎంట్రీ ఇచ్చిన తీరు చూస్తుంటే సినిమా లకు పూర్తిగా దూరమైనట్లే అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీకి చెందిన కొందరు మాట్లాడుకుంటున్నారు.
అయినా తారకరత్న ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఆఫర్లు రావడం లేదు.వచ్చిన ఆఫర్స్ సక్సెస్ అవ్వడం లేదు.కనుక రాజకీయాల్లో చేరి సినిమా లకు దూరం అవ్వడమే మంచిదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.