Adi reddy bigg boss 6 : నువ్వేమైనా తోపా.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్ అంటావా? ఆదిరెడ్డికి క్లాస్ పీకిన నాగార్జున!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే 11వ వారం ముగింపు దశకు చేరుకుంది.శనివారం ఆదివారం వచ్చింది అంటే చాలు హౌస్ లో వారమంతా కంటెస్టెంట్లు చేసిన పనికి బిగ్ బాస్ గట్టిగానే బుద్ధి చెబుతూ ఉంటాడు.

 Bigg Boss 6 Telugu Nagarjuna Fires Adi Reddy His Loose Comments Bigg Boss 6, Nag-TeluguStop.com

కాగా ఈవారం ఆది రెడ్డికి బాగా గడ్డి పెట్టాడు హోస్ట్ నాగార్జున.నువ్వు ఏమైనా తోపా తురుమా అంటూ ఆది రెడ్డికి ఒక రేంజ్ లో క్లాస్ పీకాడు.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో, ఇమ్యూనిటీ విషయంలో ఆది రెడ్డి ప్రవర్తించిన తీరుని నాగార్జున తప్పుపడుతూ ఫైర్ అయ్యాడు.ఇమ్యూనిటీ దక్కించుకునేందుకు గేమ్‌ ఇచ్చినప్పుడు ఆదిరెడ్డి ఇదంతా అవసరమా మాట్లాడాడు.

ఆ తర్వాత మళ్లీ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వచ్చినప్పుడు కూడా హౌస్ లో కంటెస్టెంట్ లు ఎంతమంది చెప్పినా కూడా నేను ఆడను, నాకు అవసరమే లేదని దర్జాగా కూర్చుని టాస్క్‌ ఇచ్చినప్పుడు ఆడాలి అని అవతలివాళ్లు చెప్పినా ఆడకపోవడమే నా గేమ్‌ అని అతి తెలివి సమాధానం చెప్పాడు.ఆ సమయంలో యాటిట్యూడ్ చూపించిన ఆది రెడ్డికి తాజాగా నాగార్జున చివాట్లు తిన్నాడు.

తాజాగా బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఆ ప్రోమోలో నాగార్జున ఫుల్ గా క్లాస్ పీకాడు.బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చినప్పుడు ఆడాలి కానీ అడ్డమైన కారణాలు చెప్పి ఆడకుండా ఉండొద్దు.

ఇనయ నీకు ఆ టాస్క్ ఆడమని చెప్పినా కూడా నువ్వు ఆడకుండా దర్జాగా కూర్చున్నావు.ఒకవేళ నువ్వే ఆ టాస్క్‌ గెలిచుంటే ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ సాయంతో జెన్యూన్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌ ను ఆపగలిగేవాడివి కదా! అది సపోర్ట్‌ చేయడం కాదా? ఆటతీరు కాదా? అలా చేసుంటే జనాలు నిన్ను ఎంత మెచ్చుకునేవారు అని నాగార్జున అడిగాడు.అదంతా పక్కనపెట్టి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వేస్ట్‌ అంటావా? ఆ పాస్‌ ఎవరికి వస్తే వారికి ఓట్లు రావా? నువ్వేమైనా తోపా? తురుమా? ఆడియన్స్‌ ఏం అనుకుంటున్నారో డిసైడ్‌ చేయడానికి అని ఫైర్‌ అయ్యాడు.అప్పుడు ఆదిరెడ్డి తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చినప్పటికీ వెంటనే నాగార్జున నీ తీరు మార్చుకో ఆది రెడ్డి లేదంటే బిగ్బాస్ గేట్లు తెరిచి ఉంచడం కాదు, ప్రేక్షకులే గేట్స్ ఓపెన్ చేసుకొని వచ్చి నిన్ను బయటకు పంపించేస్తారు అంటూ హెచ్చరించాడు.

అప్పుడు ఆదిరెడ్డి ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube