త్వరలో చంద్రబాబు కి “భారీ షాక్”...ఒకే వేదికపైకి “పవన్ ,జగన్”

త్వరలో ఏపీ రాజకీయాలలో ఊహించని భారీ మార్పులు రాబోతున్నాయా.? చంద్రబాబు నాయుడు కోలుకోలేని షాక్ ఇవ్వడానికి ఏపీలో రాజకీయ పార్టీలు సిద్దంగా ఉన్నాయా.? బీజేపి పద్మ వ్యుహంలోకి చంద్రబాబు చిక్కుకున్నారా.? ఈ ప్రశ్నలు అన్నిటికి సమాధానాలు అవుననే విధంగా ఉన్నాయి.అయితే పూర్తీ రిజల్స్ రావాలంటే మాత్రం తప్పకుండా సెప్టెంబర్ వరకూ వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.రాష్ట్రంలో రాజకీయ అలజడి రేగే అవకాశం అతి త్వరలోనే ఉండబోతోందని.తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే భారీ స్కెచ్ బీజేపి ఇప్పటికే సిద్దం చేసిందని తెలుస్తోంది…వివరాలలోకి వెళ్తే.

 Big Shock To Chandrababu On Septembermonth-TeluguStop.com

రాజకీయాల్లో మిత్రులు శత్రువులు ,శత్రువులు మిత్రులు అవుతారు ఇది సహజమే.ఇదే ఈక్వేషన్ లో ఏపీ లో లెక్కలు మారిపోతున్నాయి.అవినీతిపరులు, అక్రమార్కులు…అని తిట్టనవాళ్ల దగ్గరకే.వారే నిజాయితీపరులు.అంటూ…వారి పంచన చేరడానికి ప్లాన్‌లు వేస్తున్నారు.ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా…ఇతర రాజకీయపార్టీలను తనవైపు కూడగడుతూ దూకుడుగా వెళుతోంది.

నిన్న మొన్నటి దాకా …విమర్శించిన ‘సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌’ను తమవైపు తిప్పుకునేందుకు అన్ని వ్యుహాలని అమలు చేస్తోంది.

అయితే అదే సమయంలో బిజెపి కూడా పవన్ ,జగన్ కలయిక పై మద్దతు ఇస్తోంది ఆ దిశగానే అడుగులు వేస్తోంది.వైసీపి ,పవన్ కలిపి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగితే చంద్రబాబు కి చుక్కలు కనిపించడం ఖాయం అనేది బీజేపి ప్లాన్ గా తెలుస్తోంది.అంతేకాదు…వీరిద్దరినీ కలపడానికి…అధికార బిజెపి పెద్దలు…సుముహూర్తాన్ని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది.అంతేకాదు బీజేపి పెద్దలు ఈ విషయంలో ఇప్పటకే తమ వ్యుహాలని సిద్దం చేసి పెట్టుకున్నారట.

గత ఎన్నికల్లో ఒకరిని ఒకరు తిట్టుకున్నా నేతలు ఇద్దరు సెప్టెంబర్‌ మాసంలో ఒకే వేదికపైకి వస్తారని…తెలుస్తోంది.

అప్పటికి ఎన్నికలకు మరో ఆరు మాసాలు మాత్రమే సమయం ఉంటుంది.అప్పుడు కనుక ఈ ఇద్దరు యువనేతలు.ప్రచారానికి దిగితే…ప్రజల్లో మంచి ఊపు వస్తుందని… తద్వారా తమ ఉమ్మడి శత్రువు ‘చంద్రబాబు’ ఓడిపోతారని.బిజెపి పెద్దలు భావిస్తున్నారు.

చంద్రబాబు ని కోలుకోలేని దెబ్బ కొట్టాలనేది మోడీ వ్యూహం ఆ వ్యూహాన్ని మొదటి నుంచీ ఎంతో ప్లాన్డ్ గా చేసుకుంటూ వస్తున్న మోడీ ఫైనల్ టచ్ మాత్రం సెప్టెంబర్ ఇస్తాడట.మరి మోడీ వేస్తున్న ఈ గేమ్ ప్లాన్ ని చంద్రబాబు ఎలా ఎదుర్కుంటాడో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube