టీడీపీ ఎమ్మెల్యే, కాపు నాయకుడు బోండా ఉమకు అనూహ్యంగా టీటీడీ బోర్డు మండలిలో సభ్యుడిగా ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.కృష్ణా జిల్లాకు చెందిన నేతకు ఈ పదవి దక్కడం తొలిసారి కావడం గమనార్హం.
అయితే ఆయనకు ఈ పదవి కట్టబెట్టడం వెనుక ఏదో మతలబు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా మం త్రి పదవి ఆశించి తీవ్రంగా భంగపడినప్పటి నుంచి ఉమ వ్యవహారం పార్టీలో చర్చకు దారితీస్తోంది.
పార్టీ కార్యక్రమా లకు కొంత దూరంగా ఉండటంతో పాటు అంటీముట్టనట్లు వ్యహరిస్తుండటం పార్టీలో కలకలం రేపుతోంది.ఇదే సమ యంలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరగడంతో అధిష్టానం అలర్ట్ అయింది.
ముఖ్యంగా జనసేన అధి నేత పవన్ కల్యాణ్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న తరుణంలో.ఆయన్ను బుజ్జగించేందుకు అనూహ్యంగా ఈ పదవి కట్టబెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు రాజకీయంగా పార్టీ బలోపేతంపై జనసేనాని పవన్ కల్యాణ్ దృష్టిసారించాడు.ఇప్పటివరకు సింగిల్ హ్యాండ్ తోనే నెట్టుకొస్తున్న పవన్, కింది స్థాయిలో మాత్రం మంచి మంచి లీడర్లను తన ఖాతాలో వేసుకునేందుకు దాదాపుగా కసరత్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది.ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా పవన్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం రాజకీయంగా టీడీపీ బలంగా ఉన్న కృష్ణా నుంచి దీనిని ప్రారంభించబోతున్నాడనే చర్చ మొదలైంది.
టీడీపీలో ఆ జిల్లాకు చెందిన కీలక నేతలతో పాటు తన సామాజిక వర్గ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.ఇదే సమయం లో టీడీపీ ఎమ్మెల్యే, కాపు సామాజిక వర్గ నేత బోండా ఉమ ప్రస్తుతం పార్టీ మారతారనే ప్రచారం జోరుగా వినిపించింది.
కృష్ణా జిల్లాకు సంబంధించి బోండా ఉమ జనసేనలో చేరుతారన్న ప్రచారం ప్రధానంగా ఉంది.టీడీపీలో అసంతృప్తితో ఉన్నారని, మంత్రివర్గ విస్తరణలోనూ పదవి దక్కకపోవడంతో అసహనంతో ఉన్నారని తెలుస్తోంది.
దీనికి తోడు భూ కబ్జాల కు సంబంధించి ఆయనపై వస్తున్న ఆరోపణల కారణంగా పార్టీ అధిష్టానం కూడా గుర్రుగా ఉందట.వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమే అన్న ప్రచారం కూడా జిల్లా స్థాయిలో జరుగుతున్నందున ఆయన మరింత ఆగ్రహానికి గురైనట్లు వివరిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉన్న సత్సంబంధాల కారణంగా ఆయన జనసేనలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, అందుకే పవన్ పై ఒక్కటంటే, ఒక్కమాట కూడా అనడం లేదన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఇక బోండా పార్టీ మారతారన్న ప్రచారంతో అలెర్ట్ అయిన టీడీపీ నాయకులు బుజ్జగింపు కార్యక్రమానికి తెరలేపారు.
అందుకే అనూహ్యంగా బోండా ఉమకు టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవి ఇచ్చారని వివరిస్తున్నారు జిల్లా నేతలు.ప్రస్తుతానికి ఆయన పార్టీ మారకుండా టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకున్నా.
వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎంతవరకు ఇస్తుందనేది కూడా అనుమానమే అంటున్నారు జిల్లా నేతలు.బోండా చేరికతో కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి తిరుగుం డదనేది పవన్ అభిమతంగా తెలుస్తోంది.
ఆయనతో పాటు టీడీపీలో అసంతృప్త నేతలంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని, వారిలో చాలామంది వైసీపీలో చేరాలా లేక జనసేనలో దూకాలా అన్న సందిగ్ధంలో ఉన్నారట.బోండా వంటి కీలక నేతలకు వస్తే మిగిలిన వారంతా జనసేన జెండా కిందకు రావచ్చొనని నాయకులు బలంగా నమ్ముతున్నారట.