అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో ఇద్దరు భారత సంతతి ప్రముఖులను కీలక పదవులకు నామినేట్ చేస్తానని ప్రకటించారు.వీరిలో ఒకరు వినయ్ సింగ్ కాగా.
రెండో వ్యక్తి కల్పనా కోటగల్.హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా వినయ్ సింగ్‌ను.
కల్పనా కోటగల్‌ను ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చ్యూనిటి కమీషన్లో కమీషనర్‌గా నామినేట్ చేస్తానని బైడెన్ తెలిపారు.
సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అయిన వినయ్ సింగ్ .యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్బీఏ)లో అడ్మినిస్ట్రేటర్‌కు సీనియర్ సలహాదారుగా వున్నారు.చిన్న వ్యాపారాలకు మెరుగైన సేవలందించేందుకు, సంస్థాగత సామర్ధ్యాలను అందించడానికి ఏజెన్సీ బృందాలకు వినయ్ సింగ్ సహాయం చేస్తున్నారు.
ఫైనాన్స్, అనలిటిక్స్లపై ఆయనకు లోతైన అవగాహనతో పాటు దాదాపు 25 ఏళ్ల అనుభవం వుంది. ఒబామా – బైడెన్ హయాంలో అసిస్టెంట్ సెక్రటరీ (యూఎస్ ఫీల్డ్)గా కూడా పనిచేశారు.
అమెరికన్ కంపెనీలకు మెరుగైన మార్కెట్ పరిస్ధితులు కల్పించడం, వాణిజ్యం, పెట్టుబడి విధానం, ప్రమోషన్ ప్రయత్నాలకు నాయకత్వం వహించడంలో వినయ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు.ఎస్‌బీఏలో చేరడానికి ముందు భారత్‌లోని కేపీఎంజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాక్టీస్‌కు భాగస్వామిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గానూ విధులు నిర్వర్తించారు.
కార్యనిర్వాహక బృందంలో సీనియర్ సభ్యునిగా అనేక సంస్థాగత ప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహించాడు.
ఇక.కల్పన విషయానికి వస్తే భారత్ నుంచి వలస వచ్చిన తల్లిదండ్రులకు ఆమె జన్మించారు.సివిల్ రైట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రాక్టీస్ గ్రూప్‌లో సభ్యురాలు.
అలాగే సెమినల్ లీగల్ టెంప్లేట్ఇన్క్లూజన్ రైడర్సహ రచయితగా వ్యవహరిస్తున్నారు.వైవిధ్యం, ఈక్విటీ, సమాన వేతన చట్టం, అమెరికన్ వికలాంగుల చట్టం, వైద్య సెలవుల చట్టం, ఫెయిర్ లేబర్ స్టాండర్డ్స్ యాక్ట్‌లపై సమస్యలకు సంబంధించి హక్కులపై పోరాడుతున్నారు.
దేశంలోని ప్రముఖ భారతీయ అమెరికన్, దక్షిణాసియా సంస్థ అయిన ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ కల్పనా నామినేషన్‌ను స్వాగతించింది.ఆమె ప్రతిభావంతురాలైన న్యాయవాది అని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖిజా అన్నారు.
ఆమె నామినేషన్‌కు మా గట్టి మద్ధతును అందిస్తామని తెలిపారు.