బైక్ లపై దూసుకెళ్తున్న బిజేపి 'బండి ' ! 

తెలంగాణలో బిజెపి స్పీడ్ పెంచింది.పార్టీని మరింత బలోపేతం  చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తూ,  అనేక ప్రజ ఉద్యమాలు చేపట్టడంతో పాటు,  టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.

 Bandi Sanjay Started Prajala Gosha Bjp Bharosa Bike Rallies Details, Telangana,-TeluguStop.com

దీనిలో భాగంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ మేరకు బిజెపి పెద్దల సలహాలు,  సూచనలతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ద్వారా వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

దీనిలో భాగంగానే ప్రజల గోస బిజెపి భరోసా పేరుతో యాత్రలకు రూపకల్పన చేశారు.దీనిలో భాగంగా బైక్ ర్యాలీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

నిత్యం ఐదారు గ్రామాల్లో ఈ బైక్ ర్యాలీలు నిర్వహించే విధంగా ప్రణాళికను రూపొందించారు.

నేటి నుంచి బైక్ ర్యాలీలతో తెలంగాణ హోరెత్తించేందుకు తెలంగాణ బిజెపి నాయకులు సిద్ధం అయ్యారు.తెలంగాణలో నెలకొన్న స్థానిక సమస్యలను గుర్తించడం , వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకువెళ్లడం ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్లడం,  ఈ సందర్భంగా వారికి బిజెపి అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందనే విషయాలను ఈ బైక్ ర్యాలీలలో వివరించాలని నిర్ణయించుకున్నారు.10 రోజుల పాటు ఈ బైక్ ర్యాలీలు జరగనున్నాయి. ప్రజా గోషా బిజెపి భరోసా కార్యక్రమాన్ని నేడు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేటలో ప్రారంభించారు.సిద్దిపేటలోని నాంచార్ పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం బైక్ ర్యాలీని సంజయ్ ప్రారంభించారు.

Telugu Bandi Sanjay, Bjp Bike Raly, Dk Aruna, Prajalagosha, Rajasingh, Telangana

బిజెపి శ్రేణులు భారీ ఎత్తున ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు .బిజెపి ఇన్చార్జ్ మురళీధర్ రావు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.బైక్ ర్యాలీ అనంతరం బండి సంజయ్ వేములవాడ నియోజకవర్గంలోని ఫాజుల్ నగర్ లో బైక్ ర్యాలీని ప్రారంభించనున్నారు.ఇక గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ బోధన్ లో బైక్ ర్యాలీని ప్రారంభించారు.

ప్రజాగోస బిజెపి భరోసా యాత్రలో మొదటిగా ఎంపిక చేసిన ఆరు నియోజకవర్గాల్లో ఈ బైక్ ర్యాలీ జరగనుంది .తాండూరు నియోజకవర్గానికి డీకే అరుణ,  బోధన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్,  వేములవాడకు యెండల లక్ష్మీనారాయణ , జుక్కల్ కు వివేక్ వెంకటస్వామి,  సిద్దిపేటకు పి మురళీధర్ రావు , నర్సంపేటకు రఘునందన్ రావును ఇన్చార్జిలుగా నియమించారు. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube