అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2 ప్రోమో లీక్‌.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

నందమూరి బాలకృష్ణ ఎంతో ఇష్టపడి చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో ను ఈనెల 4వ తారీఖున దసరా సందర్భంగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.ప్రోమో గురించి పలు ఆసక్తికర విషయాలు ఆహా టీం నుండి లీక్ అయ్యాయి.

 Balakrishna Unstoppable Talk Show Season 2 Promo Details, Balakrishna, Unstoppab-TeluguStop.com

ముఖ్యంగా ప్రోమోలో బాలయ్య ను 5 నుండి 6 గెటప్స్ లో చూడబోతున్నట్లుగా వారు చెప్తున్నారు.గతంలో ఎప్పుడు చూడని గెటప్స్ లో బాలయ్య ను చూడబోతున్న ప్రేక్షకులు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారని అంటున్నారు.

బాలకృష్ణ ఈ సీజన్ లో మరింత దూకుడుగా వ్యవహరిస్తారని, ఆయన గేమ్స్ లో కూడా అత్యంత పాజిటివ్ గా స్పీడ్ గా పాల్గొంటారని ఈ ప్రోమో ని చూస్తే అనిపించేలా డిజైన్ చేశారట.ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రోమో కు దర్శకత్వం వహించాడు.

 Balakrishna Unstoppable Talk Show Season 2 Promo Details, Balakrishna, Unstoppab-TeluguStop.com

ఆయన ఆ మధ్య బిగ్ బాస్ షో కు మాత్రమే కాకుండా ఇంకా పలు కార్యక్రమాలకు కూడా ప్రోమో షూట్ చేసి ఇవ్వడం జరిగింది.బాలకృష్ణ పై ఒక యాక్షన్ సినిమా స్థాయి లో ప్రోమో ను చిత్రీకరించారని సమాచారం అందుతుంది.

ప్రోమో చిత్రీకరణ కోసం ఏకంగా పాతిక లక్షల రూపాయలను ఖర్చు చేశారట.ఒక కార్యక్రమం యొక్క షో ప్రోమో కి అంతగా ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Telugu Balakrishna, Prasanth Verma, Unstoppable, Unstoppablenbk-Latest News - Te

మొత్తానికి ప్రోమో విడుదలకుండానే చాలా హైప్‌ అయితే క్రియేట్ చేసింది.ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా చిత్రీకరణ ముగింపు దశ కు చేరుకుంది.నవంబర్ నెలలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా ను బాలయ్య చేయబోతున్నాడు.ఈ ఇద్దరి సినిమా లు మాత్రమే కాకుండా మరో ఇద్దరు కూడా బాలయ్య తో సినిమా ను చేసేందుకు లైన్లో వేసి ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube