సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలయ్య!

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా అఖండ.ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల అయ్యి ప్రతి చోట పాజిటివ్ టాక్ రావడంతో నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 Balakrishna Performs Special Prayers At Simhadri Appanna Temple, Akhanda, Akhand-TeluguStop.com

ఈ సినిమాతో బాలయ్య మిగతా హీరోలకు కూడా భరోసా ఇచ్చారు.ఈ సినిమా విజయం సాధించడంతో చిత్ర యూనిట్ మొత్తం సింహాచలం సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ తో పాటు అఖండ టీమ్ లోని సభ్యులు కూడా అప్పన్న స్వామిని దర్శించు కున్నారు.అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అఖండ టీమ్ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.

దర్శనం అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు.అఖండ సినిమా విజయం సాధించిన సందర్భంగా వైజాగ్ లో విజయోత్సవ సభను ఏర్పాటు చేసాం అని తెలిపాడు.

Telugu Akhanda, Balakrishna, Boyapati, Simhadri, Simhadriappanna-Movie

అందుకే ముందుగా అఖండ విజయానికి కృతజ్ఞతలు తెలియ జేసుకునేందుకు స్వామివారిని దర్శించుకున్నాం.ఈ సంవత్సరంలో దాదాపు 9 నెలల తర్వాత విడుదల అయినా సినిమాకు మంచి ఆదరణ చూపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు బాలయ్య.ఇది మా విజయం కాదు.em>చిత్ర పరిశ్రమ విజయం.ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది.

Telugu Akhanda, Balakrishna, Boyapati, Simhadri, Simhadriappanna-Movie

మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనే విషయాన్నీ మరొకసారి రుజువు చేసారు” అంటూ బాలయ్య అఖండ విజయంపై తన ఆనందాన్ని తెలిపాడు.ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వైజాగ్ లోని ఎంజిఎం గ్రౌండ్స్, యుడా పార్క్ లో అఖండ విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు మేకర్స్.ఇక ఇందులో అఖండ టీమ్ మొత్తం పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube