సూపర్ స్టార్ కి బాలయ్యను ఢీ కొట్టేంత సత్తా ఉందా?

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా భగవంత్ కేసరి( Bhagavanth Kesari ).టైటిల్ విభిన్నంగా ఉండటంతో పాటు కాన్సెప్ట్ కూడా విభిన్నంగా ఉండబోతుంది.

 Balakrishna Bhagavanth Kesari And Vijay Leo Movie Box-office Fight , Balakrishna-TeluguStop.com

ఇరవై ఏళ్ల అమ్మాయికి తండ్రి పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు.ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే కన్ఫర్మ్‌ అయింది.

దసరా సందర్భంగా సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

Telugu Balakrishna, Kajal Agarwal, Leo, Sreeleela, Vijay-Movie

హీరోయిన్ గా కాజల్ అగర్వాల్‌ నటించగా శ్రీ లీల( Sreeleela ) కీలక పాత్రలో కనిపించబోతుంది.ఆకట్టుకునే మంచి కథ మరియు కథనం తో ఈ సినిమా ను అనిల్ రావిపూడి రూపొందిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా కి పోటీగా తెలుగు బాక్సాఫీస్ వద్ద తమిళ్ సూపర్ స్టార్ విజయ్‌ లియో సినిమా( Leo movie ) రాబోతుంది.

లియో వర్సెస్ భగవంత్ కేసరి అన్నట్లుగా దసరా పోటీ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పటి వరకు లియో సినిమా తెలుగు హడావుడి మొదలు అవ్వలేదు.

మొన్న సంక్రాంతికి విజయ్ తన సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన విషయం తెల్సిందే.తమిళంలో సూపర్‌ హిట్ అయిన విజయ్ సినిమా తెలుగు లో మాత్రం డిజాస్టర్ గా వసూళ్ల ను నమోదు చేయడం జరిగింది.

తమిళంలో సూపర్ స్టార్‌ అయినా కూడా టాలీవుడ్‌ లో మాత్రం సంపూర్నేష్ బాబు అన్నట్లుగా ఆయన సినిమా ఫలితాలు ఉన్నాయి అంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం జరిగింది.

Telugu Balakrishna, Kajal Agarwal, Leo, Sreeleela, Vijay-Movie

ఆ సినిమా తో సత్తా చాటలేక పోయిన విజయ్ కి ఈ సినిమా తో అయినా ఇక్కడ సక్సెస్ దక్కేనా అనుకుంటూ ఉంటే బాలయ్య కి పోటీగా రావాల్సిన పరిస్థితి నెలకొంది.టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద బాలయ్య తో పోటీ పడటం అంటే కచ్చితంగా కష్టమైన విషయం.అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమా( Veera Simha Reddy )లతో దూకుడు మీదున్నాడు.

ఇలాంటి సమయంలో బాలయ్య ను తట్టుకోవాలి అంటే కష్టం.అందుకే విజయ్ లియో సినిమా కి తెలుగు లో ఎంత వరకు వర్కౌట్ అయ్యేను అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube