వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.రేపటి నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనం కల్పించనున్నారు.
వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి టీటీడీ అధికారులు భక్తులకు టోకెన్లు జారీ చేశారు.ఇందులో భాగంగా 23, 24 వ తేదీల్లో టోకెన్లు పూర్తి కాగా 25వ తేదీకి సంబంధించిన టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది.రేపటి నుంచి పది రోజులు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది టీటీడీ.
ఈ క్రమంలోనే తిరుపతి, తిరుమలలోని సుమారు పది కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా టోకెన్లను ఇస్తుండగా మొత్తం 4 లక్షల 23 వేల 500 టోకెన్లను జారీ చేయనుంది.