ప్రశాంత్ ను మడత పెట్టాల్సిందే... రైతు బిడ్డపై అర్జున్ షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ 7 కార్యక్రమంలోకి కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth) హౌస్ లోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.అయితే రైతు బిడ్డగా వెళ్ళినటువంటి ప్రశాంత్ పట్ల మొదటి నుంచి హౌస్ లో చులకన భావంతో చూస్తున్నారు.

 Arjun Ambanti Shocking Comments On Pallavi Prashanth , Bigg Boss, Arjun Ambanti,-TeluguStop.com

గత ఐదు వారాల నుంచి అమర్( Amar )పల్లవి ప్రశాంత్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు.అయితే తాజాగా వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వెళ్లినటువంటి వారిలో అర్జున్ అంబటి( Arjun Ambanti ) కూడా ఒకరు.

ఇక ఈయన కూడా పల్లవి ప్రశాంత్ పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడటంతో ఒక్కసారిగా ప్రేక్షకులు షాక్ అయ్యారు.ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే.

Telugu Amardeep, Arjun Ambanti, Bigg Boss-Movie

బిగ్ బాస్ హౌస్లో రైతు బిడ్డగా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ హౌస్ లో శివాజీ చెప్పే మాట తప్ప ఎవరి మాటలను వినడు కానీ అర్జున్ తనకు ఏదో సలహా ఇస్తే పల్లవి ప్రశాంత్ దానిని లైట్ గా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.దీంతో అర్జున్ పట్టరాని కోపంతో ఊగిపోయి పల్లవి ప్రశాంత్ పై ఉన్నటువంటి విషం మొత్తం బయటకు వెళ్లగక్కాడు.అనంతరం గౌతమ్( Gautham ) దగ్గర అర్జున్ కూర్చుని పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ ఆ ఎర్రి పుష్పం గాడికి ఒక సలహా ఇస్తే లైట్ తీసుకున్నాడు.ఏదైనా టాస్క్ పడనీ చెప్తా.

మొన్న కలర్ టాస్క్ లో మొత్తం మడత పెట్టాల్సి ఉంది ఎందుకు వదిలేసావు టాస్కులో మడత పెట్టేయాల్సింది అప్పుడు వీడు ఆడతాడు వీడు ఆడుతాడు అనే మాట ఎగిరిపోయి ఉండేది.

Telugu Amardeep, Arjun Ambanti, Bigg Boss-Movie

ఈ విధంగా అర్జున్ గౌతమ్ దగ్గర పల్లవి ప్రశాంత్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.అసలు పల్లవి ప్రశాంత్ పై ఎందుకు మీకు అంత కోపం అంటూ కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు.మరి కొందరు మాత్రం నీకన్నా ఆ అమర్ ఎంతో బెటర్.

ఐదు వారాలపాటు హౌస్ లో పల్లవి ప్రశాంత్ కొనసాగుతూ అందరికీ పోటీగా నిలిచి మొదటి కెప్టెన్ అయ్యారు.ఐదు వారాల తర్వాత బయట నుంచి నువ్వు వచ్చి ఇప్పుడు తనని మడత పెట్టేయాల్సింది అంటావా నువ్వు తొందరలోనే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతావు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో పల్లవి ప్రశాంత్ కు మరింత మద్దతు పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube