జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు.కాబోయే సీఎం చంద్రబాబే అన్న లోకేశ్ వ్యాఖ్యలను పవన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు.
బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న జన సైనికులకు సమాధానం చెప్పాలని హరిరామ జోగయ్య అన్నారు.బడుగు బలహీన వర్గాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్న జన సైనికుల కలలు ఏం కావాలని ప్రశ్నించారు.
ఏపీలో రెండే కులాలు రాజ్యమేలుతున్నాయన్న ఆయన 80 శాతం జనాభా ఉన్న బడుగుబలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడని ప్రశ్నించారు.రాజ్యాధికారం చేపట్టే విషయంలో పవన్ వైఖరి ఏంటో జనసైనికులకు అర్థం అయ్యేటట్లు చెప్పాలని లేఖలో తెలిపారు.