ఏపీలోని మున్సిపల్ కార్మికులను చర్చలకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.ఈ మేరకు సెక్రటేరియట్ లో మంత్రి ఆదిమూలపు సురేశ్ తో మున్సిపల్ కార్మికులు భేటీకానున్నారు.
అయితే ఏపీలో గత మూడు రోజులుగా తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ మున్సిపల్ కార్మికులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు.
అలాగే ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దాంతో పాటు ఫీల్డులో పని చేసే కార్మికులకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే పలు మార్లు మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం అయ్యాయన్న సంగతి తెలిసిందే.