ఏపీ వార్షిక బడ్జెట్ లో సంక్షేమానికే పెద్దపీట వేసింది ప్రభుత్వం.ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో రూ.2 లక్షల 79 వేల 279 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.ఈ నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కోసం ప్రభుత్వం కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
వ్యవసాయం కోసం రూ.11,589.48 కోట్లు కేటాయించగా, వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.1,212 కోట్లు కేటాయించారు.ఇక సెకండరీ ఎడ్యుకేషన్ కోసం రూ.29,690.71 కోట్లు, వైద్యారోగ్య శాఖ రూ.15,882.34 కోట్లు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ.15,873.83 కోట్లు, ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ కోసం రూ.9,118.71 కోట్లు, విద్యుత్ శాఖ రూ.6,546.21 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు, జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు, వైఎస్ఆర్ -పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1000 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు, జగనన్న చేదోడు రూ.350 కోట్లు కేటాయించింది.
అదేవిధంగా వైఎస్ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసాకు రూ.125 కోట్లు, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు, రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు, లా నేస్తం రూ.17 కోట్లు, జగనన్న తోడు రూ.35 కోట్లుతో పాటు ఈబీసీ నేస్తం పథకం కోసం రూ.610 కోట్లు, వైఎస్ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు, వైఎస్ఆర్ ఆసరా రూ.6,700 కోట్లు, వైఎస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు, అమ్మవడి పథకానికి రూ.6,500 కోట్లు కేటాయింపులు జరిగాయి.