ఓ నాయకా 'ఢిల్లీ ' పిలుస్తోంది రా...! 

ఈ పార్టీ లేదు , ఆ పార్టీ లేదు .ఏ పార్టీ నాయకుడికి కష్టం వచ్చినా,  అవసరం వచ్చినా,  వెంటనే ఢిల్లీకి ప్రయాణం కట్టడం పరిపాటిగా మారిపోయింది.

 Ap And Telengana Political Leaders Delhi Tour Bjp, Janasena, Rahul Gandhi, T-TeluguStop.com

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని రాజకీయ పార్టీల నేతలు తరచుగా ఢిల్లీకి వెళ్లడం కాస్త ఊరట చెంది రావడం వంటివి సర్వసాధారణంగా మారిపోయింది .తెలంగాణ బిజెపి విషయానికి వస్తే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పదేపదే ఢిల్లీకి వెళ్తున్నారు.తెలంగాణ బిజెపిలో ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ నాయకుడికి క్లాస్ పీకాలన్న వెంటనే బిజెపి అధిష్టానం పెద్దలు ఢిల్లీకి రావలసిందిగా ఆదేశిస్తున్నారు .దీంతో సదరు నేతలు ఢిల్లీకి వెళ్లి క్లాస్ పీకించుకోవడం,  సమస్యలను పరిష్కరించుకోవడం వంటివి చేస్తున్నారు.ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది .ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో , తెలంగాణ రాజకీయ అంశాల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul gandhi ) చర్చించేందుకు కాంగ్రెస్ కీలక నేతలను ఢిల్లీకి పిలిపిస్తున్నారు.అక్కడే రాజకీయ వ్యవహారాలపై చర్చిస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Bandi Sanjay, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan,

 ఎన్నికల్లో బీఆర్ఎస్  , బిజెపిలను( BRS party ) ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలు పైన , వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయింపు అంశం పైన చర్చిస్తున్నారు.ఇక ఏపీ అధికార పార్టీ వైసిపి పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఏపీలో వైసిపి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలోనూ, కేసులు,  బెయిల్ వ్యవహారాలు , సిబిఐ, ఈడి దూకుడు తగ్గించేందుకు కేంద్ర బిజెపి పెద్దలతో తరచుగా వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ భేటీ అవుతున్నారు.

ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోది, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP nadda ) తో పాటు , మరికొంతమంది కేంద్ర మంత్రులను జగన్ కలుస్తూ వివిధ అంశాలపై చర్చిస్తూ ఊరట పొందే విధంగా బిజెపి పెద్దల నుంచి హామీలను పొందుతున్నారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వంటి వారు ఇదేవిధంగా కేంద్ర బిజెపి పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు సందర్భం దొరికినప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తూ పొత్తుల అంశంపై చర్చిస్తున్నారు .
.

Telugu Ap Cm Jagan, Ap, Bandi Sanjay, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan,

ఈ విధంగా ఏపీ , తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నేతలు తమకు ఏ కష్టం వచ్చినా, అవసరం వచ్చినా, వెంటనే ఢిల్లీకి వెళ్లడం సర్వసాధారణ అంశంగా మారిపోయింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మొత్తం ఢిల్లీ చుట్టూనే తిరుగుతోంది.అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ అమలు అమలవుతుండడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.

ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల దగ్గర పడిన నేపథ్యంలో ఢిల్లీ ఫ్లైట్ లు ఎక్కి దిగే నాయకులు ఎక్కువైపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube