రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సింగర్ మాళవిక( Singer Malvika ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మొదట పాడుతా తీయగా కార్యక్రమంతో బాగా గుర్తింపు తెచ్చుకుంది మాళవిక.
అలా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ,,తమిళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో పాటలను పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో పాటలను పాడి అలరించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా మాళవిక చెప్పాలని ఉంది అనే కార్యక్రమంలో పాల్గొంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ క్రమంలోని హోస్ట్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది.
మీకు ఇష్టమైన తోటి గాయనీగాయకులు ఎవరు? అని అడగగా మాళవిక స్పందిస్తూ.నాకు అందరితో మంచి స్నేహం ఉంది.కారుణ్య, నేను పాడుతా తీయగాలో ఒకేసారి పాల్గొన్నాము.
మేము ఇద్దరం విజేతలుగా నిలిచాము.అబ్బాయిల్లో తను అమ్మాయిల్లో నేను గెలిచాను.
మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం.అలాగే నేను, హేమచంద్ర, శ్రీకృష్ణ, గీతామాధురి ( Hemachandra, Srikrishna, Geetamadhuri )మేమంతా రోజూ మాట్లాడుకుంటాము అని తెలిపింది మాళవిక.
మీరు పాడిన పాటల్లో బాగా కష్టంగా అనిపించిన పాట ఏది అని ప్రశ్నించగా.రాజన్న సినిమాలో అమ్మా.
అవనీ నేలతల్లీ.పాట పాడగానే చాలా ఆనందం వేసింది.
కీరవాణి గారి దగ్గర మరో మంచి పాట పాడాను అనుకుని ఆనందపడ్డాను.
కానీ కొన్ని రోజుల తర్వాత పాటలో కొన్ని మార్పులు చేయాలని పిలిచారు.అప్పుడు నాకు బాగా జలుబు చేసి ఉంది.అంతే పాడాను.
ఆ పాట తీసేస్తారేమో అని భయపడ్డాను.కానీ అలానే ఉంచారు.
దానికి నాకు నంది అవార్డు( Nandi Award ) కూడా వచ్చింది అని తెలిపింది మాళవిక.తరువాత కీరవాణితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి? అని ప్రశ్నించగా.మాళవిక మాట్లాడుతూ.గంగోత్రి సినిమాలో పాట కోసం ఆయన ఫోన్ చేసి రమ్మని పిలవగానే మా కుటుంబమంతా కలిసి వెళ్లాము.ఏ సినిమా, హీరో ఎవరు వివరాలేవీ కనుక్కోలేదు.పాడేసి వచ్చేశాక క్యాసెట్ చూస్తే అర్థమైంది అల్లు అర్జున్, రాఘవేంద్రరావు సినిమా అని.ఆ క్యాసెట్‌పై బాలుగారి పేరు నా పేరు పక్కపక్కన చూసేసరికి కన్నీళ్లు ఆగలేదు.ఆనందంతో సీడీ షాపులోనే ఏడ్చేశాను అని చెప్పుకొచ్చింది మాళవిక.