టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనుష్క ( Anushka ) త్వరలోనే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ( Miss Shetty Mister Polishetty ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు హీరో నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty ) మాత్రమే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తూ వచ్చారు.
అయితే తాజాగా అనుష్క సైతం ఈ సినిమా ప్రమోషన్లలో భాగమయ్యారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ తాను ఈ సినిమాలో అన్విత అనే ఒక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తానని తెలియజేశారు.ఇప్పటివరకు స్థానం నటించిన అరుంధతి, భాగమతి, దేవసేన వంటి తరహాలో ఈ పాత్ర ఉండబోతుందని తెలియజేశారు.ఇందులో నేను చాలా సానుభూతిపరురాలుగా కనిపిస్తానని అనుష్క తెలియజేశారు.ఇక తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో నటన అంటే ఏంటో కూడా నాకు తెలియదు.
కానీ నేను ఈ స్థాయికి వచ్చాను అంటే తెర వెనక నాకు ఎంతోమంది చాలా సపోర్ట్ చేశారని, ప్రతి విషయం నాకు అర్థమయ్యేలా చెప్పారని ఈ సందర్భంగా అనుష్క తెలిపారు.
ఇక తాను నటించే తన పాత్ర కోసం ఎక్కడి వరకైనా వెళ్తాను.నేను నటించే పాత్ర ప్రేక్షకులలో అలా గుర్తుండి పోవాలి దానికోసం ఎంత దూరమైనా వెళ్తానని అనుష్క తెలియజేశారు.ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనుష్క పెళ్లి ( Marriage )గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది ఈ సందర్భంగా అనుష్క పెళ్లి గురించి మాట్లాడుతూ తాను వివాహ వ్యవస్థకు వ్యతిరేకం కాదని తెలిపారు.
నేను కూడా టైం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అయితే ఆ విషయం మీ అందరితోనూ పంచుకుంటానంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి అనుష్క చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.