ఆ భయం ఇప్పటికి నన్ను వెంటాడుతుంది... అనుష్క కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కచాలా విరామం తర్వాత నవీన్ పోలీశెట్టి(Naveen Polishetty) తో కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి ( Miss Shetty mister polishetty )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈమె కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాల గురించి తెలియజేశారు.

 Anushka Interesting Comments On Her Career In Miss Shetty Mister Polishetty Pram-TeluguStop.com

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ ఈ సినిమాలో తను ఒక చెఫ్ పాత్రలో నటించానని తెలిపారు.ఇందులో తన పాత్ర చాలా వైవిద్య భరితంగా ఉంటుందని అనుష్క వెల్లడించారు.

Telugu Anushka, Mahesh Babu, Shettymister, Tollywood-Movie

ఇందులో మీరు చెఫ్ పాత్రలో నటించారు మరి నిజంగా కూడా మీకు వంట చేయడం వచ్చా అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.తనకు వంట చేయడం అయితే వచ్చు కానీ మా అమ్మ చేసినంత రుచిగా వంటలు చేయలేదని తెలిపారు.కానీ ఇంటికి ఎవరైనా ఆధితులు వస్తే మాత్రం భోజనం చెయ్యనివ్వకుండా పంపించనని నాకు వచ్చిన వంటకాలు చేసి వారికి భోజనం పెట్టే పంపిస్తానని అనుష్క తెలిపారు.మీరు ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో మీ ప్రయాణం ఇంత సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుందని ఊహించారా అనే ప్రశ్న తనకు ఎదురయింది.

Telugu Anushka, Mahesh Babu, Shettymister, Tollywood-Movie

ఈ ప్రశ్నకు అనుష్క( Anushka ) సమాధానం చెబుతూ.నా సినీ కెరియర్ ఇన్ని సంవత్సరాలపాటు కొనసాగుతుందని నేను అసలు ఊహించలేదు ఎలాంటి ప్రణాళికలతో నేనెప్పుడూ ముందుకు వెళ్లలేదు నాకు అన్ని తెలివితేటలు కూడా లేవు.ఇక తాను చేసే ఏ పాత్ర అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలి ఆ పాత్రకు నేను సరైన న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే తాను నటిస్తానని తెలిపారు.ఇక కెరియర్ మొదట్లో నన్ను ఎప్పుడు కూడా ఒక భయం వెంటాడుతూనే ఉండేదని ఈమె తెలిపారు.

సెట్లోకి వెళ్లి ధైర్యంగా డైలాగ్‌ చెప్పగలుగుతానా.నాకిచ్చిన పాత్రకు న్యాయం చేయగలుగుతానా.

దర్శక నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానా? అని భయపడేదాన్ని అని తెలిపారు ఇప్పటికి కూడా నేను ఏదైనా ఒక కొత్త సినిమా చేస్తున్నానంటే కొద్ది రోజులు ఆ భయం నాలో ఉంటుందంటూ అనుష్క చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube