ప్రస్తుత రోజుల్లో సినిమాలో విడుదల అవుతే చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వెంటనే రివ్యూ రాయడం మొదలు పెడతారు.అంతటితో అయిపోలేదు ఫస్ట్ రోజు కలెక్షన్లు రెండవ రోజు కలెక్షన్లు మూడవ రోజు కలెక్షన్లు తర్వాత వీకెండ్ కలెక్షన్లు అంటూ ఎన్ని కోట్లు వచ్చాయో ఆ విషయం కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రాస్తూ ఉంటారు.
ఇలా ఒక సినిమా కాదు, స్టార్ హీరోల సినిమాలన్నీ దాదాపు ఇదే పద్దతిలో పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి.ఒక సినిమాని మించి మరో సినిమా రికార్డులు సాధించిందంటూ ప్రచారం చేస్తారు.
ఒక సినిమా టోటల్‌గా 600 కోట్లు కలెక్ట్ చేస్తే.మరో సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది అంటారు.కానీ తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా సాధించిన రికార్డును గతంలో ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.ఇక భవిష్యత్తులో దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఎలాంటి సినిమాకైనా లేదు అనే విషయం మీకు తెలుసా? ఎన్ని వందల కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా అయినా, ప్రపంచంలోని ఎన్ని దేశాల్లో రిలీజ్ చేసినా ఆ రికార్డును క్రాస్ చెయ్యడం ఎవ్వరి వల్లా కాదు.అదేమిటో చూద్దాం.అక్కినేని నాగేశ్వరరావు,( Akkineni Nageswara Rao ) శ్రీదేవి( Sridevi ) జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ప్రేమాభిషేకం చిత్రం( Premabhishekam ) ఫిబ్రవరి 16, 1981లో ఈ సినిమా విడుదలైంది.
ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది.ఆ సినిమాలోని కొత్తదనం, అద్భుతమైన పాటలు, నటీనటుల పెర్‌ఫార్మెన్స్, దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) రాసిన మాటలు, టేకింగ్ ఇవన్నీ అప్పటి ప్రేక్షకులు నావెల్టీగా ఫీల్ అయ్యారు.అందుకే సినిమాకి బ్రహ్మరథం పట్టారు.ప్రేమాభిషేకం చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో 100 రోజులు రన్ అయింది.అన్ని సెంటర్లలో సిల్వర్ జూబ్లీకి కూడా వెళ్లింది.దాదాపు 20 సెంటర్లలో సంవత్సరం పాటు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇలాంటి ఘనత సాధించిన సినిమా ఇదే కావడం విశేషం.
ఒకప్పుడు వినోదం అనేది సినిమా ద్వారానే ప్రేక్షకులకు అందేది.వినోదం కావాలంటే థియేటర్‌కే వెళ్ళాలి.అందుకే కొన్ని సినిమాలు సంవత్సరాల పాటు రన్ అయ్యేవి.
కానీ, ఇప్పుడా పరిస్థితి లేదన్నది అందరికీ తెలిసిన విషయమే.ఎంత పెద్ద హిట్ సినిమా అయినా 50 రోజులు రన్ చెయ్యాలంటే సాధ్యమయ్యే విషయం కాదు.
రెండు, మూడు వారాలకే థియేటర్ల నుంచి తీసేస్తున్నారు.నెలరోజుల్లో ఓటీటీలో ఎంత పెద్ద సినిమా అయినా ప్రత్యక్షమవుతోంది.
అలాంటప్పుడు 100 రోజులు, సిల్వర్ జూబ్లీ వరకు ఒక సినిమా వెళ్లడం అనేది ఎప్పటికీ సాధ్యపడే విషయం కాదు.