సినీ ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ అడుగుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ( Allu Arjun ) త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక ఈయన కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక అల్లు అర్జున్ వ్యక్తిగత విషయానికి వస్తే.ఈయన స్నేహారెడ్డిని 2011వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇటీవల వీరి 13వ పెళ్లిరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
అంతేకాకుండా 13వ పెళ్లిరోజు సందర్భంగా స్నేహ రెడ్డి( Sneha Reddy ) అల్లు అర్జున్ ఇద్దరు తన పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అల్లు అర్జున్ స్నేహ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలలో అందరి దృష్టి అయాన్( Ayaan ) పైనే పడింది.ఇటీవల కాలంలో అయాన్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అల్లరి పనులతో అందరిని సందడి చేస్తున్నారు.
తన తండ్రిని ఇమిటేట్ చేస్తూ నడవడం షారుక్ ఖాన్ సినిమాలోని పాటను హమ్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా మరోసారి ఫన్ క్రియేట్ చేశారు.
స్నేహ రెడ్డి అల్లు అర్జున్ పెళ్లి రోజు సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ ( Cake )కట్ చేశారు అయితే వీరందరూ కలిసి గార్డెన్ ఏరియాలో ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇలా నలుగురు కలిసి ఫోటోలు దిగుతున్నటువంటి సమయంలో అయాన్ మినహా మిగిలిన ముగ్గురు ఫోటోలపై ఫోకస్ పెట్టగా అయాన్ మాత్రం ఒక కప్పులో కేక్ వేసుకొని కేక్ తినడంలో నిమగ్నమైపోయాడు.దీంతో మరోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.అయాన్ కి కేక్ అంటే అంత ఇష్టమా .ఎవరిని పట్టించుకోవడం లేదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.