గత ఏడాది మన తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన మ్యాజిక్ గురించి అందరికి తెలుసు.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియన్ వ్యాప్తంగా అందరిని కట్టి పడేసింది.
రామ్ చరణ్ ( Ram Charan )అండ్ ఎన్టీఆర్( NTR ) హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 1200 కోట్లు వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అగ్ర డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అనే విషయం తెలిసిందే.
జక్కన్న మహేష్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాల్సిందే.ఇదిలా ఉండగా ఈ సినిమా పనులు జరుగుతుండగానే జక్కన్న మరో సినిమాను ఓకే చేసినట్టు సమాచారం.
అది కూడా మాస్ మహారాజా రవితేజతో అని తెలుస్తుంది.
క్రాక్, ధమాకా వంటి రెండు సూపర్ హిట్స్ అందుకున్న రవితేజ( Ravi Teja ) మళ్ళీ ఇటీవలే వచ్చిన రావణాసుర సినిమాతో ప్లాప్ అందుకున్నాడు.అయినా కూడా తగ్గకుండా ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు.రవితేజ డైరెక్టర్ వంశీ( Director Vamsi ) దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు”.
ఇక ఈ సినిమా తర్వాత రావణాసుర సినిమా డైరెక్టర్ సుధీర్ వర్మ( Director Sudhir Verma ) దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.
అయితే ఈసారి సుధీర్ తో సినిమా మాములుగా ఉండదని.సరికొత్త కథతో పాటు మేకింగ్ లో కూడా చాలా మార్పులు చేయనున్నట్టు తెలుస్తుంది.అదిరిపోయే ప్లాన్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి చూస్తున్న నేపథ్యంలోనే ఇందుకోసం రాజమౌళి సలహాను తీసుకోనున్నారట.
ఇప్పటికే వీరి కాంబోలో విక్రమార్కుడు సినిమా వచ్చింది.ఆ తర్వాత మరో సినిమా చేద్దాం అనుకున్న కుదరలేదట.
అందుకే ఇప్పుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేయబోయే సినిమాకు రాజమౌళి విలువైన సూచనలు ఇవ్వడానికి అంగీకరించి పరోక్షంగా రవితేజ సినిమాకు జక్కన్న ఇన్వాల్వ్ అవుతున్నట్టు తెలుస్తుంది.మరి రాజమౌళి సలహాలు, సూచనల వల్ల అయిన ఈ సినిమా హిట్ అవుతుందేమో చూడాలి.