ప్రజా సమస్యలను ఏనాడు పట్టించుకోని టిడిపి నేత… లోపాయికారి ఒప్పందాలతో డబ్బులు దండుకోవడమే తన లక్ష్యంగా పనిచేసే కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కి తనను విమర్శించే స్థాయి లేదని మాజీ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.నెల్లూరు నగరంలోని 8వ డివిజన్ లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
పేదల పక్షపాతి గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన సాగిస్తుంటే టిడిపి నేతలు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం పేద ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కి ముడుపులు అందకుంటే లేనిపోని ఆరోపణలకు పాల్పడుతున్నారని ధ్వజ మెత్తారు.
ప్రతిపక్షం అంటే ప్రజల కోసం పోరాడాలే తప్పా ప్రజలను బూచిగా చూపిస్తూ డబ్బులు దండుకోవడం కాదని సిగ్గుంటే ఇప్పటికైనా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం అలవర్చుకోవాలని ఆయన హితవు పలికారు.