బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల (Suma kanakala) ముందు వరుసలో ఉంటారు.గత రెండు దశాబ్దాలకు పైగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా స్టార్ మహిళగా కొనసాగుతూ ఉన్నారు.
ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా మరోవైపు సినిమా ఈవెంట్లకు కూడా యాంకర్ గా( Anchor ) వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.యాంకర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడమే కాకుండా ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఎన్నో రకాల వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.ఇకపోతే సుమ ఎక్కువగా తన స్టాఫ్ ను పరిచయం చేస్తూ వీడియోలు చేస్తుంటారు.
అలాగే కొన్ని సందర్భాలలో తన కుటుంబ సభ్యులను కూడా ఈమె పరిచయం చేస్తూ వారికి సంబంధించినటువంటి విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా సుమ తన తాతయ్య( Suma Grandfather ) సాధించిన ఘనత గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
సుమ తాతయ్య అంటే తన అమ్మమ్మ గారి సోదరుడు పి బాలసుబ్రమణ్యన్ మీనన్( P Balasubramanyan Menon ) 98 ఏళ్ళ వయసులో అరుదైన గౌరవం అందుకున్నారు.ఈయన ఒక అడ్వకేట్.( Advocate ) గత 73 ఏళ్ళగా ఈయన ఈ ప్రొఫెషన్ లో వర్క్ చేస్తూ వస్తున్నారు.ఇన్నాళ్ల లాంగ్ కెరీర్ పూర్తి చేసుకున్న లాయర్ (Lawyer) గా ఈయన గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా ఈ విషయాన్ని గుర్తించినటువంటి గిన్నిస్ బుక్ వారు.
సుమ తాతయ్య పేరును గిన్నిస్ బుక్ రికార్డు(Guinness Book Record) లో చేరుస్తూ ఆయనకు సర్టిఫికెట్ అందించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను సుమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేయడంతో అభిమానులు కూడా తన తాతయ్య సాదించిన ఈ ఘనత పై ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా అభినందనలు తెలియజేస్తున్నారు.