అమెరికా : ఇద్దరు భారతీయ అమెరికన్స్ కు కీలక పదవులు...!!

అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ భాద్యతలు చేపట్టిన నాటి నుంచీ నేటి వరకూ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, లేదా ఏ కీలక పదవులను భర్తీ చేసినా వాటిలో భారతీయులకు చోటు తప్పనిసరిగా ఉంటుంది.ఎన్నికల సమయంలో భారతీయ అమెరికన్స్ కు పెద్ద ఎత్తున పదవులు కట్టబెడుతానని చెప్పిన బిడెన్ అన్నట్టుగానే ఎన్నికైన వెంటంటే సుమారు 50 మంది భారతీయ అమెరికన్స్ ను కీలక పదవులతో గుర్తించి సత్కరించారు.

 America: Key Positions For Two Indian Americans ,  Indian Americans, Innovative-TeluguStop.com

ఆ తరువాత అమెరికా అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీలలో భారతీయులకు కీలక భాద్యతలు అప్పగించారు బిడెన్.అంతేకాదు తనకు సలహాలు ఇచ్చేందుకు గానీ, తాను పాల్గొనే సమావేశాలలో మాట్లాడేందుకు మాటల కూర్పులో కానీ, చివరికి దేశ ఉపాధ్యక్ష పదవికి సైతం భారతీయులనే ఎంచుకున్నారు బిడెన్.

తాజాగా.

బిడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

భారతీయుల ప్రతిభను గుర్తించిన బిడెన్ అమెరికా జాతీయ మౌలిక వసతుల సలహా మండలిని ఏర్పాటు చేశారు.ఇందులో ఇద్దరు ఇండో అమెరికన్స్ కు కీలక భాద్యతలు అప్పగించారు.

ఈ జాతీయ మండలిలో సుమారు 26 మంది ఉండగా వారిలో ఇద్దరు భారతీయ అమెరికన్స్ అయిన మను ఆస్థానా, మధూ బెరివాల్ లకు చోటు కల్పించడం గమనార్హం.ఈ విషయాన్ని శ్వేతా సౌధం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

Telugu Americakey, Biden, Pam-Telugu NRI

అమెరికా మౌలిక వసతులకు, అలాగే అమెరికాలో సైబర్ ప్రభావాన్ని తగ్గించి భద్రతను కల్పించేందుకు వీరు అధ్యక్షుడు బిడెన్ కు కమిటి ద్వారా సలహాలను అందిస్తారు.ఈ మధ్య కాలంలో అమెరికా సైబర్ దాడులను ఎదుర్కోవడమే కాకుండా వాటిని తప్పి కొట్టడంలో విఫలం అవుతోందని ఈ క్రమంలోనే అధ్యక్షుడు బిడెన్ కమిటిని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.విధ్యత్ ఉత్పత్తి, పర్యవేక్షణ,తదితర రంగాలలో మను ఆస్థానా ఎంతో అనుభవం కలిగిన వారు, అలాగే పిఏఏం అనే సంస్థకు సిఈవో గా భాద్యతలు నిర్వహిస్తున్నారు.అంతేకాదు తన వ్యాపార సామ్రాజ్యాన్ని అమెరికాకు మాత్రమే పరిమితం చేయకుండా కెనడా, మెక్సికో లకు కూడా విస్తరించారు.

ఇక.

మధు బెరివాల్ IEM ( ఇన్నోవేటివ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఇన్ కార్పోరేటెడ్ ) అనే సంస్థను స్థాపించారు.ఈ సంస్థ ద్వారా ప్రక్రుతి విపత్తులు జరిగినపుడు , వరదలు, భూకంపాలు ఇలాంటి విపత్తుల తరువాత పరిస్థితులను చక్కదిద్దేందుకు పునర్నిర్మాణాలు చేపడుతుంటారు.అంతేకాదు బెరివాల్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ అమెరికాలోనే అతి పెద్ద భద్రతా , సహాయ సంస్థగా పేరొందింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube