రాబోయేకాలం మరింత ఘోరం..అమెరికా FDA సంచలన వ్యాఖ్యలు..!!

అమెరికాలో రోజు రోజుకి కరోనా మహమ్మారి చావులు పెరిగిపోతున్నాయి.ఈ వైరస్ కారణంగా ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య సైతం లెక్కకి మించే ఉంటోంది.అమెరికా వ్యాప్తంగా సుమారు 65 లక్షలమంది కరోనా బారిన పడగా, సుమారు 1.94 వేల మంది మృతి చెందారు.ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికాలోనే కేసుల బాధితుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.ఉద్యోగాలు కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న వారు కరోనా ఎప్పుడెప్పుడు తగ్గుముఖం పడుతుందోనని వేచి చూస్తున్నారు.అయితే…

 America Fda Scott Gottlieb Survey Coronavirus-TeluguStop.com

కరోనా మహమ్మారి పై తాజగా జరిగిన ఓ అధ్యయనం అమెరికా ప్రజల్ని మరింత భయభ్రాంతులకి గురి చేస్తోంది.ఉద్యోగాలు కోల్పోయినా, సరైన తిండి లేకపోయినా, చివరికి నిలువ నీడ లేకపోయిన ఎలాగోలా బ్రతికేయచ్చు కానీ ఈ మహమ్మారి తీవ్రత మరింతగా విరుచుకుపడనుంది అనే మాటలు మాత్రం అమెరికా ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి కరోనా మహమ్మారి విజ్రుంభణ తీవ్ర రూపం దాల్చనుందని.

అమెరికాలోని ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోన తప్పకుండా సోకనుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ చీఫ్ స్కాట్ గాట్లిబ్ ప్రకటించారు.

రాబోయేది శీతాకాలమని ఈ కాలంలో వ్యాధులు ప్రభలే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.అమెరికా జనాభాలో సుమారు 20శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతారని అన్నారు.

అయితే మాస్క్ లు, గ్లౌజులు , శానిటైజర్ ‘వంటివి వాడకంపై ప్రజలకి విసుగు వచ్చిందని వాటిని వాడటం మానేస్తున్నారు, దాంతో కరోనా మరింతగా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube