అల్లు అర్జున్ బుల్లి బుట్టబొమ్మ వీడియో మీరు చూశారా?

మన టాలీవుడ్ హీరోల పిల్లల విషయంలో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు.వీరికి సోషల్ మీడియాలో తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Allu Arjun,allu Arha,sneha Reddy,dance Video,diwali,social Media,diwali Celebrat-TeluguStop.com

హీరో అల్లు అర్జున్ తన పిల్లలతో చేసే చిలిపి, అల్లరి పనులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటాడు.

సరదాగా అర్హ పెళ్లి గురించి తనతో వాగ్వాదం చేసిన మాటలు, రాములో రాముల పాట ఎలా ఉంది అని అడిగా దోస స్టెప్ అని అల్లు అర్హ చెప్పిన వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.

ఇకపోతే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు తన పిల్లలు చేసే అల్లరి పనులను, ఏదైనా పండుగలప్పుడు ముస్తాబు చేసే విషయాలను గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

Telugu Allu Arha, Allu Arjun, Dance, Diwali, Sneha Reddy-Latest News - Telugu

లాక్ డౌన్ సమయంలో వీరి చేసే అల్లరి పనులను, ఇద్దరు కలిసి ఆడిన దాగుడు మూతలు, అర్హ ఇల్లు మొత్తం రంగులతో నింపి చేసిన వీడియోలు అన్నింటిని స్నేహ రెడ్డి అభిమానులతో పంచుకున్నారు.అయితే ఇప్పుడు తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని అల్లు అర్హను ఎంతో అందంగా ముస్తాబు చేసిన ఈ వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియోలో తన సొట్ట బుగ్గల బుట్ట బొమ్మ ఎంతో అందమైన డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపించింది.

ఈ వీడియోలో తనతో పాటు అర్హ బాబీ కూతురు కూడా ఉన్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంది.ఈ దీపావళికి అల్లు అర్జున్ దగ్గరుండి తన కూతురు చేత క్రాకర్స్ వెలిగించాడు.మొత్తానికి ఈ దీపావళి పండుగ అల్లు వారింట ఎంతో వేడుకగా, ఆనందంగా జరుపుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube