సంక్రాంతి తరువాత దసరాపై కన్నేసిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా మారి బన్నీకి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.ఇక ఈ సినిమాతో బన్నీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

 Allu Arjun To Release Next Movie During Dussehra-TeluguStop.com

అయితే తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో.

అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే అంశంపై ఇండస్ట్రీ వర్గాల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడనే వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతుండగా, ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కాగా వచ్చే ఏడాదిలో ఆర్ఆర్ఆర్, చిరు152, ప్రభాస్ సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ఆయా హీరోలు రెడీ అవుతున్నారు.

దీంతో ఎలాగైనా ఈ దసరాకే తన సినిమాను రిలీజ్ చేసేందుకు బన్నీ తన సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాతో ఎట్టిపరిస్థితుల్లో తన సినిమాను రిలీజ్ చేయాలని బన్నీ ఫిక్స్ అయ్యాడు.

మరి బన్నీ నిర్ణయానికి తగ్గట్లుగా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube