దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంటుంది.ఈ మేరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 400 పాయింట్లకు పైగా గాలి నాణ్యత నమోదు అవుతుంది.
కాలుష్య ప్రభావంతో విజిబులిటీ 500 మీటర్లకు పడిపోయింది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఢిల్లీ అంతటా వాయు కాలుష్యం కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే వాయు కాలుష్యం నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సర్కార్ యాభై శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది.
అదేవిధంగా బీఎస్ 6 కార్లు, ట్రక్కులతో పాటు వాణిజ్య వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది.