తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.
17 ఎంపీ స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు.
ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.అలాగే ఎన్నికల హామీలను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరన్న ఈటల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.మోదీకి ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని తెలిపారు.