లోక్ సభ ఎంపీల సస్పెన్షన్ పై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు.మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య నిబంధనలను చెత్తబుట్టలో పడేస్తోందని విమర్శించారు.
పార్లమెంట్ భద్రతలో క్షమించరాని ఉల్లంఘనపై ఉభయ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.అలాగే పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సవివరమైన చర్చ జరగాలని పేర్కొన్నారు.
ప్రధాని, హోంమంత్రికి జవాబుదారీతనం లేదన్నారు.ప్రతిపక్షాలు లేని పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్న కీలక చట్టాలను బుల్ డోజ్ చేయగలరని విమర్శించారు.
ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను ఆమోదించుకుంటారని మండిపడ్డారు.