తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు సీనియర్ నటి యమున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది యమున(Yamuna).
కాగా మొదట మౌన పోరాటం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్రమందారం, బంగారు కుటుంబం, బ్రహ్మచారి మొగుడు తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత బుల్లితెర కి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పలు కామెడీ సీరియల్స్ లో(Comedy serials) కూడా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటికే బుల్లితెరపై బోలెడు సీరియల్ అవకాశాలతో దూసుకుపోతుంది.ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటూనే తనకు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ తన అభిమానులకు చేరువగా ఉంటుంది.
ఇకపోతే నటి యమున 2011లో బెంగుళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం(adulter)కేసులో పట్టుబడిందనే వార్త అప్పట్లో సంచలనం రేపింది.అయితే ఈ వ్యవహారంలో యమున తప్పేమీ లేదంటూ కావాలనే ఇరికించారంటూ న్యాయస్థానంలో క్లీన్‌చీట్ లభించింది.
దీని గురించి పలు సందర్భాల్లో, పలు వేదికల మీద చెప్పుకొచ్చింది.
తాజాగా అదే విషయం గురించి స్పందిస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.హాయ్ అండి.నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా తెలియని ఓ బాధ అయితే నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.
అది కూడా సోషల్ మీడియా వల్ల.ఎందుకంటే నేను ఏళ్ల క్రితమే ఓ సమస్య నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉంటున్నాను.
ఆ ప్రాబ్లమ్‌లో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చేశాను.ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్(Clean chit) ఇచ్చి నన్ను గెలిపించింది.
న్యాయ పరంగా నేను విజయం సాధించాను.కానీ సోషల్ మీడియాను మాత్రం నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను.
ఇప్పటికి కూడా నా గురించి, ఆ సంఘటన గురించి రకరకాల థంబ్‌నెయిల్స్, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.