Trisha: త్రిషకు అదృష్టం జలగలా పట్టిందిగా.. మరో మూవీ ఆఫర్ కొట్టేసిన త్రిష?

తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ త్రిష( Trisha ) గురించి మనందరికీ తెలిసిందే.త్రిష ప్రస్తుతం దక్షిణ భారత సినిమాల్లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Actress Trisha Back To Back Movies In South Industry-TeluguStop.com

ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అగ్ర హీరోయిన్ గా రాణించడంతోపాటు ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది త్రిష.అవకాశాల విషయంలో మాత్రమే కాకుండా అందం విషయంలో కూడా ముద్దుగుమ్మ ఏ మాత్రం తగ్గడం లేదు.

Telugu Trisha, Kollywood, Offers, Ps, Raod, Tirsha Offers, Tirsha, Tollywood, Tr

వయసు పెరుగుతున్న కూడా వన్నెతరగని అందంతో యువత గుండెల్లో గుబులు రేపుతోంది.కాగా త్రిష తెలుగులో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పిఎస్2 సినిమాతో( PS 2 Movie ) ప్రేక్షకులను పలకరించింది.ఇది ఇలా ఉంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష మరోసారి ఫామ్ లోకి వచ్చేసింది.

గత రెండు మూడేళ్లుగా త్రిషకు సరైన సక్సెస్ గా లేదు.

Telugu Trisha, Kollywood, Offers, Ps, Raod, Tirsha Offers, Tirsha, Tollywood, Tr

సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలు సరైన సక్సెస్ ను సాధించడం లేదు.పొన్నియన్ సెల్వన్ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి.ఈ సినిమాలు ఇంకా పట్టాలెక్కకముందే మరిన్ని అవకాశాలు వచ్చి చేరుతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ పార్ట్ వన్, లియో లో, శత్తురంగ్ వెట్టై-2 సినిమాలలో నటిస్తోంది.వీటితో పాటుగా ది రోడ్( The Road ) అనే లేడీ ఓరియేంటెడ్ సినిమా కూడా చేస్తోంది.

అంతే కాకుండా మళ్లీ తెలుగులో బిజీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే అప్పట్లో ఆమె కోలీవుడ్లో వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube