నాకు అప్పట్లోనే ఒక్క నైట్ కి 20 లక్షలు ఆఫర్ చేసారంటున్న సీనియర్ నటి.... కానీ

సినిమా పరిశ్రమకి ఎవరైనా సరే మంచి పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకొని వెండి తెరపై వారి పేరును చూసుకోవాలని కోటి ఆశలతో వస్తుంటారు.ఇలా వచ్చిన వారిలో కొంతమంది కష్టపడి పనిచేసే అవకాశాలు దక్కించుకొని గుర్తింపు తెచ్చుకొని ముందుకు సాగుతుంటే, మరికొందరు మాత్రం అవకాశాలు దక్కించుకోలేక వారి నటన టాలెంట్ నిరూపించుకునే అవకాశం రాక ఏళ్ల తరబడి అవకాశాల కోసం నిరీక్షిస్తున్నారు.

 Shakeela, Tollywood Actress, Remuneration News, Casting Couch Issue, Film Indust-TeluguStop.com

  ఇంకొందరు మాత్రం పాత్ర ఏదైనా సరే ముందు తెరంగేట్రం చేసి ఆ తరువాత చూద్దాంలే అంటూ సర్దుకుపోతున్నారు.సరిగ్గా ఇదే ఆలోచనలతో అప్పట్లో శృంగార తరహా చిత్రాల్లో నటించి కుర్రకారు గుండెల్లో హీట్ పెంచిన నటి షకీలా కూడా సినీ పరిశ్రమకి వచ్చింది.

అయితే తాజాగా నటి షకీలా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా తన సినీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

తాను కూడా అందరిలాగే తన నటన పరంగా టాలెంట్ ని నిరూపించుకొని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని సినిమా పరిశ్రమకు వచ్చానని, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఒకానొక సమయంలో అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

కానీ తాను మొదట్లో తీసుకున్నటువంటి ఆ నిర్ణయమే తన జీవితాన్ని మలుపు తిప్పిందని, దర్శకనిర్మాతలు కూడా ఎక్కువగా తనలో శృంగార తరహా శైలి పాత్రలో మాత్రమే ఆఫర్ చేశారని అందువల్ల తన సినీ కెరీర్ కోసం చేయలేక తప్పలేదని తెలిపింది.

అయితే అప్పట్లో తాను ఒక్కో సినిమాకి దాదాపుగా 3 లక్షలు నుంచి 4 లక్షల రూపాయల పారితోషికం తీసుకునేదానిని అని, కొంతమంది దర్శక నిర్మాతలు ఒక్క రాత్రికి 20 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఆఫర్లు కూడా ఇచ్చారనీ కానీ తాను ఎప్పుడూ అలాంటి ఆఫర్లకి లొంగలేదని చెప్పుకొచ్చింది.

తాను కేవలం శృంగార తరహా సన్నివేశాల్లో మాత్రమే నటించానని ఇప్పటి వరకు ఎవరితోనూ శృంగార సన్నిహిత సంబంధాలు పెట్టుకోలేదని స్పష్టం చేసింది.

ఏదేమైనప్పటికీ ఒక నటిగా తాను ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉండాలని అందువల్లనే దర్శక నిర్మాతలు ఎలాంటి పాత్రలు ఆఫర్ చేసినా నటించానని చెప్పుకొచ్చింది.అంతేకాక ఎప్పటికైనా తాను ఒక అనాధాశ్రమం నిర్మించి అండదండలు లేని వారికి సేవ చేయాలనేది తన జీవిత లక్ష్యమని తెలిపింది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube