సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.అయితే హీరోయిన్లు( Heroines ) మరీ బోల్డ్ గా మాట్లాడితే నచ్చే అభిమానుల కంటే నచ్చని అభిమానులే ఎక్కువగా ఉంటారు.
తాజాగా రేఖా నాయర్( Rekha Nair ) అనే నటి తన బోల్డ్ కామెంట్ల ద్వారా విమర్శల పాలయ్యారు.ఈ నటి చేసిన కామెంట్లు ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్( Kollywood, Tollywood ) ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
నడుముపై చెయ్యి వేస్తే నేను ఎంజాయ్ చేస్తానని ఈ నటి చెప్పుకొచ్చారు.
మహిళలు వేసుకుంటున్న చిట్టిపొట్టి డ్రెస్సుల వల్ల అబ్బాయిలు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా అనే ప్రశ్న ఎదురు కాగా తాను ఎప్పుడు చీర కట్టుకున్నా నడుము కనబడే విధంగా కట్టుకుంటానని ఆమె తెలిపారు.
ఏ పోటీలలో పాల్గొన్నా జాగింగ్ కు వెళ్లినా నా దుస్తులు అదే విధంగా ఉంటాయని రేఖా నాయర్ పేర్కొన్నారు.ఈ విధంగా దుస్తులను ధరిస్తే నాకు సౌకర్యవంతంగా ఉంటుందని అదే సమయంలో సంతోషం కలుగుతుందని ఈ హీరోయిన్ చెప్పుకొచ్చారు.
అబ్బాయిలు అమ్మాయిల నడుమును తాకితే కొందరు అమ్మాయిలు ఏదో జరిగిందనే విధంగా హడావిడి చేస్తున్నారని హీరోయిన్ అన్నారు.ఈ తరహా అభిప్రాయాలను అమ్మాయిలు మార్చుకుంటే మంచిదని రేఖా నాయర్ పేర్కొనారు.ట్రావెలింగ్ సమయంలో ఎవరి చెయ్యైనా నా నడుముకు తాకితే సంతోషిస్తానని ఆమె అన్నారు.రేఖా నాయర్ కామెంట్లు దారుణంగా ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు.
అబ్బాయిలను రెచ్చగొట్టే విధంగా రేఖా నాయర్ కామెంట్లు చేయడంపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పాపులారిటీ రావాలనే రేఖా నాయర్ ఇలాంటి కామెంట్లు చేసున్నారని నెటిజన్లు భావిస్తున్నారు.రేఖా నాయర్ తన ప్రవర్తనను మార్చుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ బోల్డ్ కామెంట్ల వల్ల ఈ బ్యూటీకి సినిమా, టీవీ ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.