కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తమపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే వారికి గట్టిగా సరైన సమాధానం చెబుతారు.మరికొందరు సెలబ్రిటీలు అలా ప్రవర్తించిన వారి నుండి భయపడుతూ తప్పించుకొని మళ్లీ వారి గురించి చెప్పలేకపోతారు.
కానీ ఓ నటి మాత్రం తన పై అసభ్యంగా ప్రవర్తించిన వారికి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది.అంతేకాకుండా ఓ డైరెక్టర్ ను ఒరేయ్ అని కూడా పిలిచి అతడి చెంప పగలగొట్టింది.
ఇంతకీ ఆ నటి ఎవరంటే.
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటి రాణి అలియాస్ రక్ష.
ఈమెను ఈ తరం ప్రేక్షకులు అంత త్వరగా గుర్తుపట్టకపోగా.నచ్చావులే సినిమాలో తనిష్క్ తల్లి పాత్రలో నటించిన నటినే రాణి.
ఈమె ప్రేమలేఖ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషలలో నటించింది రక్ష.
పంచదార చిలక, అడవి చుక్క, పవిత్ర ప్రేమ వంటి పలు సినిమాలలో దాదాపు 30కి పైగా సినిమాలలో నటించి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది.
మళ్లీ రీ ఎంట్రీ తో తల్లి పాత్రలలో నటించింది.ఇదిలా ఉంటే ఈమె కొన్ని ఏళ్ళ కిందట డైరెక్టర్ ను చెంప చెల్లుమనిపించిందట.ఈమె గతంలో ఆలీతో సరదాగా షోలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది.తమది ఓ చిన్న గ్రామం అని తన తండ్రి సినిమాల కోసం చెన్నై కు వెళ్లి స్థిరపడ్డారని తెలిపింది.
తన తండ్రి నిర్మాతగా పలు సినిమాలను నిర్మించగా ఆర్థికంగా బాగా నష్టపోయారట.

ఇక తనకి కూడా నటనపై ఆసక్తి ఉండటంతో చిన్న చిన్న పాత్రలతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైందట.తాను తొలిసారిగా నటించిన ప్రేమ లేఖలు సినిమా తనకు మంచి గుర్తింపు ఇచ్చిందని అందులో తను నటించిన స్పెషల్ సాంగ్ తనకు మంచి సక్సెస్ ఇచ్చిందని తెలిపింది.ఇక తనపై ఎవరైనా పిచ్చిగా ప్రవర్తిస్తే వాళ్లను అసలు సహించలేనని తెలిపింది.
బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న రవన్న సినిమా షూటింగ్ సమయంలో తను చెన్నై నుంచి హైదరాబాద్ కు విమానంలో వస్తుంటే పక్కన ఓ పెద్దాయన కూర్చొని తనపై అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది.
ఇక దాంతో తనకు కోపం రావడంతో ఈ వయసులో ఇదేం పనిరా అంటూ అక్కడే అతడి చెంప పగలగొట్టానని తెలిపింది.ఇక తమిళ దర్శకుడు తనకు కథ చెప్పినప్పుడు పెళ్లయిందని, గ్లామర్ పాత్రలు చేయనని క్లియర్ గా చెప్పిందట.

అయితే షూటింగ్ మొదలైన తర్వాత అతడి ప్రవర్తన వేరేలా ఉండటమే కాకుండా తన భర్త గురించి వేరే రకంగా మాట్లాడటంతో అతనిపై మండిపడిందట.‘ఒరేయ్ ఇలా రారా’ అని అతడిని పిలిచి మరీ అతడి చెంప పగలగొట్టాలనని తెలిపింది.పోలీస్ కి కంప్లైంట్ ఇద్దామని అనుకోడంతో హీరో తన సినిమా ఆగిపోతుందని బ్రతిమాలాడట.ఆ తర్వాత తను ఆ సినిమాలో నటించలేనని తెలిపింది.ఇక పెళ్లి చేసుకుని చిన్న చిన్న పాత్రలలో నటిస్తుంది రక్ష.