కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత.. ఇద్దరు పిల్లలతో ఫోటో రివీల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నమిత తెలుగులో జెమిని,బిల్లా,సింహా,సొంతం, ఒక రాజు ఒక రాణి లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.

 Actress Namitha Gave Birth To Twins Actress Namitha, Tollywood, Birth To Twins,-TeluguStop.com

సింహ సినిమాలో సింహం అంటే చిన్నోడు వేటకు వచ్చాడు అన్న పాట తో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.కాగా మొదట వెంకటేశ్ హీరోగా నటించిన జెమిని సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అలాగే టాలీవుడ్ లో వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలతో నటించి మెప్పించింది నమిత.

ఇకపోతే ఈ ప్రస్తుతం నమిత సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఇటీవల బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన ఆమె త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించినవిషయం తెలిసిందే.కాగా తాజాగా తనకు ట్విన్స్ పుట్టారు అంటూ అభిమానులకు చక్కని శుభవార్త చెప్పింది.

ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది.కాగా నమిత కు ఇద్దరు కూడా పండంటీ మగ బిడ్డలు పుట్టారు.

అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఈ శుభ వార్తను మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.

ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల మాకు ట్విన్స్ పుట్టారు.వారికి మీ ఆశీర్వాదం కూడా కావాలి.అలాగే నన్ను హస్పిటల్ లో చాలా బాగా చూసుకున్నందుకు ఆసుపత్రి యాజమాన్యానికి అలాగే డా.భువనేశ్వరీ, డా.ఈశ్వర్, డా.వెళ్లు మురుగన్ లకు చాలా థ్యాక్స్ హ్యాపీ జన్మాష్టమి అని రాసుకొచ్చింది నమిత.

ఈ ఫోటో లను చూసిన నమిత అభిమానులు ఆమెకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube