కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత.. ఇద్దరు పిల్లలతో ఫోటో రివీల్!
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నమిత తెలుగులో జెమిని,బిల్లా,సింహా,సొంతం, ఒక రాజు ఒక రాణి లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.
సింహ సినిమాలో సింహం అంటే చిన్నోడు వేటకు వచ్చాడు అన్న పాట తో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.
కాగా మొదట వెంకటేశ్ హీరోగా నటించిన జెమిని సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
అలాగే టాలీవుడ్ లో వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలతో నటించి మెప్పించింది నమిత.
ఇకపోతే ఈ ప్రస్తుతం నమిత సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.
కాగా ఇటీవల బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన ఆమె త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించినవిషయం తెలిసిందే.
కాగా తాజాగా తనకు ట్విన్స్ పుట్టారు అంటూ అభిమానులకు చక్కని శుభవార్త చెప్పింది.
ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది.కాగా నమిత కు ఇద్దరు కూడా పండంటీ మగ బిడ్డలు పుట్టారు.
అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.
శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఈ శుభ వార్తను మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
"""/" /
ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల మాకు ట్విన్స్ పుట్టారు.వారికి మీ ఆశీర్వాదం కూడా కావాలి.
అలాగే నన్ను హస్పిటల్ లో చాలా బాగా చూసుకున్నందుకు ఆసుపత్రి యాజమాన్యానికి అలాగే డా.
భువనేశ్వరీ, డా.ఈశ్వర్, డా.
వెళ్లు మురుగన్ లకు చాలా థ్యాక్స్ హ్యాపీ జన్మాష్టమి అని రాసుకొచ్చింది నమిత.
ఈ ఫోటో లను చూసిన నమిత అభిమానులు ఆమెకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అతిథులు ఎవరంటే?