విజయవాడ బస్టాండ్ లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని ఏపీఎస్ ఆర్డీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు అన్నారు.ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సాంకేతిక లోపమా.? మానవ తప్పిదమా అనే కోణంలో విచారణ చేస్తున్నామని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.అదేవిధంగా ప్రమాదంలో ప్రాణాల కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని చెప్పారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు.అయితే విజయవాడ బస్టాండ్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడగా పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.