రాజమౌళి మహాభారతంలో చిన్న పాత్ర ఇస్తే చాలు.. ప్రభాస్ కోరిక మాములుగా లేదుగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా మంచి పేరు సంపాదించుకున్న రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే.తన దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా నిలిచాడు.

 Small Role In Rajamouli Mahabharata Movie Is Prabhas Wish, Rajamouli,  Director,-TeluguStop.com

ఎంతో మంది స్టార్ హీరోలకు మంచి సక్సెస్ అందించాడు.పలు పాన్ ఇండియా సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పేరు సంపాదించుకున్నాడు.

బాహుబలి సినిమాతో మాత్రం ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు.ఈ సినిమాలో నటించినందుకు ప్రభాస్ కెరీర్ కూడా బాగా మలుపు తిరిగింది.

అలాంటిది ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమాలో కూడా అవకాశం వస్తే చాలు అంటూ కోరుకుంటున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కూడా బాహుబలి సినిమాకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు.ఈ సినిమాతో మరింత అభిమానాన్ని సంపాదించుకున్నాడు ప్రభాస్.

ఇక ఈయన బాహుబలి తర్వాత మొత్తం పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడ్డాడు.పైగా ప్రస్తుతం ఆయన ఖాతాలో వరుస పాన్ ఇండియా మూవీలు మాత్రమే ఉన్నాయి.

ఇదిలా ఉంటే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీలో పాత్ర కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభాస్.గతంలో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చాలాసార్లు చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాను ఎప్పటికైనా తెరకెక్కిస్తాను అని తెలిపాడు రాజమౌళి.

Telugu Salaar, Bahubali, Mahabharata, Pan India, Prabhas, Prabhs, Rajamouli, Raj

ప్రస్తుతం ఈ సినిమా చేయాలి అంటే కుదరని పని అంటూ ఎందుకంటే ఈ సినిమా చాలా పెద్ద సినిమా అని ఈ సినిమా చేస్తున్న సమయంలో వేరే సినిమాలను చేయడం కూడా కుదరదు అని తెలిపాడు.కారణం ఈ సినిమా మొదలు పెట్టాము అంటే పూర్తి దృష్టి దానిపైన ఉంచాలి అని గతంలో తెలిపాడు రాజమౌళి.

అంటే రాజమౌళి మాటలను బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు.

ఎందుకంటే బాహుబలి సినిమాతోనే అందరి దృష్టిలను తాకిన రాజమౌళి ఇక ఈ సినిమాతో ఇంకెంత దృష్టిని మలుపుకుంటాడో అర్థమవుతుంది.కానీ అంతలోపే ప్రభాస్ రాజమౌళిపై కన్ను వేశాడు.

రాజమౌళి ఎప్పుడైతే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అన్నాడో.ప్రభాస్ కు కూడా మహాభారతంపై బాగా ఆశ కలిగింది.

దీంతో గతంలో ప్రభాస్ కు ఈ సినిమాలో అవకాశం వస్తే చేస్తారా అని ప్రశ్న ఎదురవగా.ఈ సినిమాలో రాజమౌళి చిన్న పాత్ర ఇచ్చినా చాలు వెంటనే ఓకే అనేస్తాను అని తెలిపాడు.

దీంతో ప్రభాస్ కు మహాభారతంపై కోరిక చాలానే ఉందని తెలుస్తుంది.

Telugu Salaar, Bahubali, Mahabharata, Pan India, Prabhas, Prabhs, Rajamouli, Raj

ఇక ప్రస్తుతం రాజమౌళి మరో పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.పైగా ఇందులో మల్టీస్టారర్స్ గా స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు.ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో మరో సినిమా చేయనున్నాడు.

మహేష్ బాబు సినిమా తర్వాత ఎటువంటి అడ్డంకులు లేనట్లయితే ఖచ్చితంగా మహాభారతం షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.ప్రభాస్ కూడా ప్రస్తుతం సలార్, రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube