ఖమ్మం జిల్లాలోని పత్తి మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గత కొన్ని రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.