టాలీవుడ్ కోలీవుడ్ లో హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా యంగ్ హీరోలతో జోడీ కడుతూ బిజీ బిజీ గా ఉన్న హీరోయిన్ రెజీనా.ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఐఫా అవార్డ్స్ ఉత్సవంలో హోస్ట్ గా చేసి అందరినీ ఆకట్టుకొన్న రెజీనా తన కో స్టార్ మెగా క్యాంప్ లో ఒక హీరోతో ఘాటు ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు టాలీవుడ్ లో హాట్ హాట్ టాపిక్ గా ఉంది.
వీరిద్దరి రిలేషన్ పై వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం .మేము రెండు సినిమాల్లో కలిసి చేశాము.మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.అంతకు మించి మరే రిలేషన్ లేదు అని మెగా హీరో కొట్టేసినా వీరిద్దరి వ్యవహారం భిన్నంగా ఉందని.
టాలీవుడ్ జనం కోడై కూస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే… రెజీనా… చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో పిల్లా నువ్వులేని జీవితం సినిమాలో జోడీ కట్టింది.
అప్పటి నుంచి వీరిద్దరి పరిచయం స్నేహాన్ని మించి కొనసాగుతున్నదని ఓ టాక్ వినిపిస్తోంది.రెజీనా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సాయి ధరమ్ తో కలిసి ఉండడమే కాదు ఇద్దరు కలిసి నైట్ పబ్ లకు పార్టీలకు వెళ్తున్నట్లు టాక్.
వీరిద్దరి క్లోజ్ నెస్ చూసిన సినీ జనాలు… ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాల్లోనే కాదు రియల్ గా కూడా బాగా ఉంది అంటున్నారు.ఇటీవలే సాయి ధరమ్ తేజ్ రెజీనాను తమ ఇంటికి తీసుకుని వెళ్లి తన తల్లికి కూడా పరిచయం చేశాడనే టాక్ వినిపిస్తోంది.
దీంతో వీరిద్దరూ నిజజీవితంలో ప్రేమప్రయాణం చేస్తున్నారని క్లియర్ గా అర్ధం అవుతోంది అని అంటున్నారు.