కుర్ర హీరోల్లో సందీప్ కిషన్ అంటే ఓ సరికొత్త క్రేజ్.స్నేహగీతంలో సినిమా కోసం ప్రాణం పెట్టే పాత్రలో నటించిన ఈ యువ హీరో నిజంగానే సినిమా అంటే అదేలా ఫీల్ అవుతాడు.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్నా లాస్ట్ ఇయర్ వచ్చిన టైగర్ కాస్త పర్వాలేదనిపించింది.అయితే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా వరుసెంట సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు సందీప్ కిషన్.
ప్రస్తుతం ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాలో నటిస్తున్న సందీప్ ఆ సినిమాతో పాటుగా మరో రెండు క్రేజీ సినిమాలు చేస్తున్నాడు.
‘ఒక్క అమ్మాయి తప్ప’ తర్వాత మలయాళం ‘నేరం’ సినిమా రీమేక్ కు సైన్ చేసిన సందీప్ ప్రస్తుతం మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడట.
నారా రోహిత్ హీరోగా ‘ప్రతినిధి’ సినిమాకు రచయితగా చేసిన ఆనంద్ రవి చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట సందీప్ కిషన్.ఈ సినిమాను రాజ్ తరుణ్ సినిమా చూపిస్త మావ నిర్మాత వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఒక అమ్మాయి తప్ప సినిమాలో నిత్యా మీనన్ తో రొమాన్స్ చేస్తున్న సందీప్ కిషన్ ఇక మిగిలిన రెండు సినిమాల స్టార్ కాస్ట్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది.సో ముచ్చటగా మూడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు సందీప్ కిషన్.
మంచి కథలతో ముందుకు దూసుకెళ్తున్న సందీప్ కిషన్ కు రాబోయే సినిమాలన్ని సూపర్ హిట్స్ కావాలని కోరుకుందాం.