వై కా పా అధినేత జగన్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకు గుంటూరులో బాధ్యతలు అప్పగించారు.బొత్స ఉత్తరాంధ్ర నాయకుడు కదా .
ఈయనకు గుంటూరులో బాధ్యతలు ఏమిటి? అనే సందేహం కలుగుతుంది.అయితే ఇవి పార్టీ బాధ్యతలు కావు.
జగన్కు సంబంధించిన సొంత పని.పార్టీ నాయకులు అధినేత సొంత పనులు కూడా చేయాల్సిందే.జగన్ పని ఏమిటంటే….ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు అంటే విజయవాడకు తరలిపోయారు.పూర్తిగా అక్కడే ఉంటున్నారు.అక్కడి నుంచే పరిపాలన సాగుతున్నది.
అక్కడ ఇల్లు, ఆఫీసు ఏర్పాటు చేసుకున్నారు.కుటుంబం కూడా అక్కడే ఉంది.
మంత్రులు, టీడీపీ నాయకులు చాలామంది తరలి పోయారు.ఇది చూసిన జగన్ తాను కూడా ఆంధ్రాకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండవచ్చని అనుకున్నారు.గుంటూరులో ఇల్లు, ఆఫీసు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.
ఇందుకు తగిన భవనాలు ఎంపిక చేసే బాధ్యత బొత్సకు అప్పగించారు.గతంలో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ దిల్లీలో ధర్నా చేసినప్పుడు అక్కడ ఏర్పాట్ల బాధ్యతా బొత్సకు అప్పగించారు జగన్.
బొత్స పనితీరు నచ్చినట్లుగా ఉంది.కాబట్టి తన ఇంటిని ఎంపిక చేసే పని కూడా ఆయనకే అప్పగించారు.