అదో కాళరాత్రే అని తెలియని డ్రైవర్ జయరామారావు నాయుడు తన భార్యాబిడ్డలను చూసుకుంటాను కదా అని లారీ స్పీడుగానే తీసుకుని ఊరు మొదల్లో పెట్టేసి చకచక నడుచుకుంటూ ఇంట్లో అడుగెట్టాడు.అంతే కళ్ళ ముందు తన గారాల భార్య వెంకటలక్ష్మి, సోమయ్యతో కనిపించేసరికి హతాసుడయ్యాడు .
అలా కుప్పకూలాడు,ఆమెకు భయం వేసింది ఆమె ప్రియుడు కూడా నిశ్చేష్టుడయ్యాడు .అక్కడ ముగ్గురులో ఎవరికీ బుర్రలు పనిచేయని పరిస్థితి వచ్చేసింది .అప్పటికే ఆమె తేరుకుని గదిలో మూలున్న గొడ్డలి అందుకుని తలపట్టుకునికూర్చున్న భర్తపై దాడి చేసి బలం కొద్ది కొట్టింది .దాంతో రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుని తల వాల్చేసాడు .ఆ దారుణం చూసిన ప్రియుడు పారిపోబోయాడు .బ్రతికున్నాడని ఆసుపత్రికి ప్రియుడు తోడుతో తీసుకుపోయింది .అక్కడ మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు .పోలీసులు విచారణ జరిపి ఇద్దరినీ అరెస్టు చేసారు .ఈ నేరకథ బ్రమ్మంగారుమటం మండలం సమీప గ్రామం కొత్త బసవపురంలో జరిగింది .