సత్యమూర్తి కొడుకుగానే బన్నీ!

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్‌ ఫిక్స్‌ అయ్యింది.ఈ సినిమాకు గత కొంత కాలంగా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

 S/o Satyamoorthy Movie First Look-TeluguStop.com

మీడియాలో ఇదే టైటిల్‌తో సినిమా గురించిన వార్తలు వచ్చాయి.అయితే ఆ టైటిల్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు.

దాంతో టైటిల్‌ విషయంలో ఎక్కడో చిన్న అనుమానం.కాని తాజాగా ఈ సినిమా టైటిల్‌ అదే అని ఫిక్స్‌ అయ్యింది.

చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమా టైటిల్‌ను అధికారింకగా ప్రకటించారు.

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మరియు ట్రైలర్‌ లాంచ్‌ను వైవిధ్యభరితంగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.‘జులాయి’ తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందనుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్‌ వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమా ఆడియోను ఈనెల 15న మరియు సినిమాను ఏప్రిల్‌ 2న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా రికార్డుల మోత మ్రోగించడం ఖాయం అంటున్నారు మెగా ఫ్యాన్స్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube