అక్కినేని హీరో నాగచైతన్యకు( Naga Chaitanya ) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో నాగచైతన్యకు సరైన సక్సెస్ లేకపోవడంతో అభిమానులు ఫీలవుతున్నారు.
అయితే తండేల్ సినిమా( Thandel Movie ) నాగచైతన్యకు భారీ హిట్ అందించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గీతా ఆర్ట్స్ బ్యానర్ పై( Geetha Arts ) తెరకెక్కిన ఈ సినిమా 2025 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
అయితే బన్నీ వివాదం ప్రత్యక్షంగా, పరోక్షంగా తండేల్ సినిమాపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది.ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతాయా అనే ప్రశ్నలు సైతం అభిమానుల నుంచి వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తండేల్ నిర్మాతలు ఈ సినిమాపై ఏ స్థాయిలో దృష్టి పెడతారనే చర్చ జోరుగా జరుగుతుండటం గమనార్హం.
తండేల్ సినిమాలో సాయిపల్లవి( Sai Pallavi ) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.సాయిపల్లవి ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.సాయిపల్లవి ఈ ఏడాది అమరన్ సినిమాతో సక్సెస్ సాధించారు.
అమరన్ మ్యాజిక్ ను సాయిపల్లవి తర్వాత సినిమాలు సైతం రిపీట్ చేస్తాయేమో చూడాల్సి ఉంది.సాయిపల్లవి లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతుండటం గమనార్హం.
సింపుల్ లుక్స్ లో కనిపిస్తూనే ఆమె బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నారు.సాయిపల్లవి ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.సాయిపల్లవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.తండేల్ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయాలని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.
గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చైతన్యకు 100% లవ్ సినిమాతో భారీ హిట్ దక్కింది.చైతన్య తర్వాత ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.