టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వెంకీ మామ ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇప్పుడు అదే ఊపుతో త్వరలోనే సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా బాలయ్య బాబు( Balayya Babu ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ లో( Unstoppable Show ) పాల్గొన్నారు వెంకి మామ.
తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ గా మారింది.ఆ ప్రోమోలో వచ్చి రావడంతోనే వెంకటేష్ తన డైలాగ్స్ తో ప్రేక్షకులను నవ్వించారు.
ఆ తర్వాత బాలయ్య బాబు నేను చూడగానే నాకు ఓల్డ్ మెమోరీస్ గుర్తుకు వస్తున్నాయి అనడంతో ఇంతలోనే నాగార్జున చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ కలిసి ఉన్న ఫోటో స్క్రీన్ మీద కనిపించడంతో నాలుగు స్తంభాలు అని అన్నారు బాలయ్య బాబు.ఆ తర్వాత వెంకటేష్ అన్నయ్య స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు.
అలా సరదా సరదాగా సాగిపోతున్న నేపథ్యంలో మీ నాన్న గురించి ఒక్క రెండు మాటలు అనడంతో లాస్ట్ లో ఏం చేయలేకపోయానే అన్న ఫీలింగ్ ఉండిపోయింది అంటూ తండ్రిని తలుచుకుంటూ అన్నదమ్ములు ఇద్దరు స్టేజి పైన ఎమోషనల్ అయ్యారు.
ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) స్టేజ్ మీదకు ఎంట్రీ ఇవ్వడంతో ఆ హంగామా సందడి కాస్త మరింత రెట్టింపు అయ్యింది.ఆ తర్వాత అనిల్ రావిపూడి థాంక్యూ మామ బాలయ్య బాబుతో కలిసి స్టేజి మీద స్టెప్పులు వేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఈనెల 27వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.ఇకపోతే బాలయ్య బాబు హీరో విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్న విషయం తెలిసిందే.
మరి ఈ ఇద్దరు హీరోలలో ఎవరో సక్సెస్ అవుతారో చూడాలి మరి.