చుండ్రు( dandruff ) అనేది మనలో చాలా మందిని చాలా కామన్ గా వేధించే సమస్య.చుండ్రు కారణంగా తలలో విపరీతమైన దురద, జుట్టు పొడిబారడం, జుట్టు అధికంగా రాలడం తదితర సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
పైగా ఆ చుండ్రు తెల్లటి పొరలుగా దుస్తులు పై రాలుతుంటే వచ్చే చిరాకు అంతా కాదు.ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకునేందుకు ఎంతో ఖరీదైన షాంపూలను వాడుతుంటారు.
అయినప్పటికీ కొందరిలో చుండ్రు పోదు.అయితే అలాంటివారు దిగులు చెందాల్సిన అవసరం లేదు.
పుదీనా ( Mint )చుండ్రు సమస్యను దూరం చేయడంలో చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మరి అందుకోసం పుదీనా ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కలబంద ఆకును ( Aloe vera leaf )తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకోవాలి.అలాగే అర కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ ( Aloe vera gel )వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె,( coconut oil ) వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ పుదీనా హెయిర్ మాస్క్ ను కనుక వేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.పుదీనా తలపై చుండ్రు మరియు దురదను సంపూర్ణంగా నివారిస్తుంది.
మురికి స్కాల్ప్ చికిత్సలో సహాయం చేస్తుంది.మీ శిరోజాలను సూపర్ హెల్తీ గా మారుస్తుంది.
అలాగే జుట్టు పెరుగుదలను సులభతరం చేస్తుంది.జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
ఇక అలోవెర, కోకోనట్ ఆయిల్, విటమిన్ ఇ ఆయిల్ స్కాల్ప్ ను హైడ్రేట్ చేస్తాయి.మరియు ఆరోగ్యమైన కురులను ప్రోత్సహిస్తాయి.