కేక్ కట్ చేస్తే కాసులు బయటపడ్డాయి, వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.ఇటీవల తన మేల్ ఫ్రెండ్స్ ఇచ్చిన బర్త్ డే సర్‌ప్రైజ్‌కి ఓ యువతి ఆశ్చర్యంలో మునిగి తేలింది.
వారికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందులో ఒక అమ్మాయి తన పుట్టిన రోజున కేక్ లాగా కనిపించే ఒక మ్యాజిక్ బాక్స్( magic box ) తెరిచి చూస్తే… అందులో కేక్ బదులు రూ.500 నోట్లు బయటపడ్డాయి! ఒక్కటి రెండు కాదు, ఏకంగా 29 నోట్లు! ఆ అమ్మాయి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది.తన స్నేహితులు ఇంత ఊహించని గిఫ్ట్ ఇస్తారని ఆమె అస్సలు ఊహించి ఉండదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అద్భుతమైన పుట్టినరోజు సర్‌ప్రైజ్ వీడియో షేర్ చేయడం జరిగింది.అందులో ఆమె స్నేహితులు కలిసి కేక్ కట్ చేయడానికి రెడీ అయ్యారు.కేక్( Cake ) మధ్యలో హ్యాపీ బర్త్‌డే అని రాసి ఉన్న ట్యాగ్ ఉంది.ఆ ట్యాగ్‌ని బయటకు తీస్తే ఏం జరిగిందో తెలుసా? అందులో నుండి రూ.500 నోట్లు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి! అవును, కేక్ లోపల నోట్లు దాచి ఉంచారు.అంతేకాదు, ఆ నోట్లను ప్లాస్టిక్‌లో చుట్టి కేక్‌కి అంటకుండా జాగ్రత్త చేశారు.
అంత చిన్న కేక్‌లో ఇన్ని నోట్లు ఎలా దాచారో అని అందరూ ఆశ్చర్యపోయారు.అమ్మాయి కూడా ఎప్పుడు ఈ నోట్లు ఆగతాయో అని ఆశ్చర్యంగా చూసింది.
సోషల్ మీడియా( Social media )లో లెక్కవేస్తే, ఆ కేక్‌లో మొత్తం 29 నోట్లు ఉన్నాయి.అంటే, ఆమెకు ఆమె స్నేహితులు రూ.14,500 ఇచ్చినట్లే! ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులకు ఆ అమ్మాయి ఎంతో కృతజ్ఞతలు తెలిపింది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ సర్‌ప్రైజ్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఈ కేక్ సర్‌ప్రైజ్ వీడియోకు 4 కోట్ల 70 లక్షల వ్యూస్ వచ్చాయి.దాదాపు 9 లక్షల మంది లైక్ చేశారు, 5 లక్షల మందికి పైగా షేర్ చేశారు.అంతేకాదు, చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్‌లలో రాశారు.కొంతమంది, “ఆ అమ్మాయికి డబ్బు వచ్చిందని కాదు, ఆమె స్నేహితుల ప్రేమ వల్లే ఆమె ఎంతో అదృష్టవంతురాలు” అని కామెంట్ చేశారు.
మరికొందరు, “నాకూ ఇలాంటి స్నేహితులు కావాలి” అని కామెంట్ చేశారు.మరికొందరు మాత్రం, “అది కేకా లేకే ఏటీఏం హా ?” అని ఫన్నీగా కామెంట్ చేశారు.కానీ, కొంతమంది మాత్రం ఈ వీడియో కేవలం వ్యూస్ కోసం చేసినదని, ఆ నోట్లు నిజం కాదని అనుకుంటున్నారు.కానీ, చాలామంది ఈ వీడియో చూసి చాలా సంతోషించారు.